AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janaka Aithe Ganaka: హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?

Janaka Aithe Ganaka: హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?

Anil kumar poka
|

Updated on: Oct 12, 2024 | 9:36 PM

Share

ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్టులతో వస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటున్న నటుడు సుహాస్. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం లాంటి సినిమాలతో పర్లేదనిపించాడు ఈ హీరో. తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో జనక అయితే గనక అంటూ వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..

ప్ర‌సాద్ అలియాస్ సుహాస్‌ సగటు మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. పెళ్లై రెండేళ్లైనా పిల్లలు మాత్రం వద్దనుకుంటాడు. తనకు పిల్లలు అంటూ పుడితే వాళ్లకు బెస్ట్ లైఫ్ ఇవ్వాలనుకుంటాడు.. అది ఇవ్వలేడు కాబట్టి పిల్లలే వద్దనుకుంటాడు. ఓ వాషింగ్ మిషన్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. భర్తను ప్రతీ విషయంలో ఫాలో అయ్యే భార్య అలియాస్ సంగీర్త‌న‌, ఎప్పుడూ కొడుకు చేతిలో తిట్లు తినే సరదా తండ్రి అలియాస్ గోప‌రాజు ర‌మ‌ణ‌, స‌ర్దుకుపోయే త‌ల్లి, ఇంట్లో బామ్మలతో హాయిగా జీవితం గడుపుతుంటాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో అనుకోకుండా ప్రసాద్ భార్య ప్రెగ్నెంట్ అవుతుంది. తాను కండోమ్ వాడిన తర్వాత కూడా భార్య గర్భవతి కావడంతో షాక్ అవుతాడు ప్రసాద్. దాంతో తన స్నేహితుడు అలియాస్ వెన్నెల కిషోర్‌ లాయ‌ర్ కావ‌టంతో.. ఆయన సాయంతో కన్స్యూమర్ కోర్టులో కండోమ్ కంపెనీపై కేసు వేస్తాడు ప్రసాద్‌. కండోమ్ కపెంనీ వాళ్లు.. తనకు కోటి రూపాయలు ఇవ్వాల్సిందే అంటాడు. ఈ క్రమంలోనే ప్రసాద్ వేసిన ప్రశ్నలకు కంపెనీ తరఫు లాయర్ ప్ర‌భాస్ శ్రీను సమాధానం చెప్పలేకపోతాడు. దాంతో దేశంలోనే ప్ర‌ముఖ లాయ‌ర్ ముర‌ళీ శ‌ర్మ‌ని కండోమ్ కంపెనీ రంగంలోకి దించుతుంది. అప్పుడేమైంది.. ప్రసాద్ కోరుకున్నట్లు కండోమ్ కంపెనీ ఆయనకు కోటి రూపాయలు ఇచ్చిందా లేదా అనేది అసలు కథ..

మెసేజ్ విత్ ఎంటర్టైన్మెంట్ చాలా రేర్ కాంబినేషన్. ఇది ఉంటే అది ఉండదు.. అది ఉంటే ఇది ఉండదు! జనక అయితే గనకలో ఈ రెండూ కుదిరాయి. దర్శకుడు తీసుకున్న పాయింట్ రిస్కీగా ఉన్నా.. ఎక్కడ లైన్ క్రాస్ చేయలేదు. ట్రైలర్ లో చూపించినట్టు కండోమ్ కంపెనీ మీద కేసు అయినా కూడా.. సినిమాలో అడ్రస్ చేసిన ఇష్యూస్ మాత్రం వేరే ఉన్నాయి. సమాజంలో జరిగే చాలా విషయాలపై డైరెక్టుగా సెటైర్ వేసాడు దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల. ఈ జనరేషన్లో చాలామంది పిల్లలు అంటే ఎందుకు భయపడుతున్నారనేది.. జనక అయితే గనకలో చాలా బాగా డిస్కస్ చేశారు. పుట్టే పిల్లల హాస్పిటల్ ఖర్చుల నుంచి డైపర్స్, స్కూల్, కాలేజ్, ఆడుకునే బొమ్మల వరకు.. పేరెంట్స్ ప్రేమను ఎలా బిజినెస్ చేస్తున్నారనేది ఆసక్తికరంగా చూపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.