Vettaiyan Review: హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
జైలర్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రజినీకాంత్ నటించిన సినిమా వేట్టయన్. కాకపోతే తెలుగు టైటిల్ పెట్టలేదని ఈ సినిమాపై ముందు నుంచి కూడా పెద్దగా అంచనాలు లేవు. పైగా జ్ఞానవేల్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు. ఇలాంటి సమయంలో వేట్టయన్ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? రజినీకాంత్ మరోసారి మాయ చేసాడా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
అథియన్ అలియాస్ రజనీకాంత్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. క్రిమినల్స్ తప్పించుకుంటే అస్సలు తట్టుకోలేడు.. అవసరం అయితే ఎన్‌కౌంటర్ చేసి న్యాయం చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే గవర్నమెంట్ టీచర్ శరణ్య అలియాస్ దుషారా విజయన్‌తో పరిచయం అవుతుంది. గంజాయి ముఠాకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటంతో ఇంప్రెస్ అవుతాడు అథియన్. ఆ అమ్మాయి సాయంతో గంజాయి ముఠా నాయకుడిని ఎన్‌కౌంటర్ చేస్తాడు. అయితే అది జరిగిన కొన్ని రోజులకే అతి దారుణంగా శరణ్యను రేప్ చేసి చంపేస్తాడు ఓ వ్యక్తి. ఆ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి ఎస్‌పీ హరీష్‌కుమార్ అలియాస్ కిషోర్‌తో పాటు ACP రూపా అలియాస్ రితికా సింగ్‌లతో రంగంలోకి దిగుతారు. కానీ వాళ్లు ఫెయిల్ అవ్వడంతో.. సీన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు అథియన్. ఆయన వచ్చిన 48 గంటల్లోనే గుణ అనే కుర్రాడిని పట్టుకుని ఎన్‌కౌంటర్ చేస్తారు. అథియన్ చేసిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి సత్యదేవ్ పాండే అలియాస్ అమితాబ్ బచ్చన్ ఆధ్వర్యంలో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. నిజానిజాలు తెలుసుకోకుండా అమాయకుడిని చంపారంటూ విచారణకు పిలుస్తారు. అప్పుడే తను చేసిన ఎన్‌కౌంటర్ గురించి.. అసలు శరణ్య ఎలా చనిపోయింది అనే విషయంపై రీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అసలు ఈ కేసులోకి ప్యాట్రిక్ అలియాస్ ఫహాద్ ఫాజిల్, నటరాజ్‌అలియాస్ రానా దగ్గుబాటి ఎలా వచ్చారు అన్నదే అసలు కథ..
రజనీకాంత్ సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం..? కాస్త స్టైల్.. కాస్త స్వాగ్.. కుదిరితే మంచి కథ.. చాలా ఏళ్ళ తర్వాత జైలర్ తో ఇది బ్యాలెన్స్ చేశాడు నెల్సన్. ఇప్పుడు జ్ఞానవేల్ దానికి మించి ఇచ్చాడు. రజీనిలోని హీరోనే చాలా మంది దర్శకులు చూశారు. కానీ చాన్నాళ్ళ తర్వాత ఆయనలోని నటుడికి పని చెప్పాడు జ్ఞానవేల్. సూపర్ స్టార్ ఇమేజ్‌కు సరిపోయే సరైన కథ రాసుకున్నాడు దర్శకుడు. మొదటి నుంచీ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. ఓ పక్క ఫ్యాన్ మూమెంట్స్ ఇస్తూనే.. మరో పక్క స్ట్రాంగ్ కంటెంట్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ చాలా వేగంగా వెళ్ళిపోతుంది. మన దగ్గర జరిగిన సెన్సేషనల్ దిశ కేసు గుర్తుకొస్తుంది. అలాగే మలయాళ చిత్రం జనగణమన కూడా గుర్తొస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.