Kiran Abbavaram: పెళ్లికి వేళాయెరా.! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ..

|

Aug 15, 2024 | 4:48 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యా గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. కడప జిల్లాకు చెందిన ఈ కుర్రాడు రాజా వారు రాణి గారు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపంతోనే సూపర్ హిట్ కొట్టాడు. మధ్యలో వరుసగా కొన్ని ప్లాఫ్‌ లు ఎదురైనా వినరో భాగ్యము విష్ణు కథతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. సక్సెస్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యా గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. కడప జిల్లాకు చెందిన ఈ కుర్రాడు రాజా వారు రాణి గారు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపంతోనే సూపర్ హిట్ కొట్టాడు. మధ్యలో వరుసగా కొన్ని ప్లాఫ్‌ లు ఎదురైనా వినరో భాగ్యము విష్ణు కథతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. సక్సెస్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ఈ మధ్యన కాస్త గ్యాప్ తీసుకున్న అతను ‘క’ అనే సింగిల్ లెటర్ టైటిల్ తో ఓ మూవీ అనౌన్స్ చేశాడు. ఇందులో పోస్ట్ మ్యాన్ గా కిరణ్ అబ్బవరం స్టిల్స్, యాక్టింగ్ అందరినీ ఆకట్టుకున్నాయి. కేవలం నటనలోనే కాదు రచయిత, నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకుంటున్నాడీ తెలుగబ్బాయి. ఇక నడవడిక, మాటతీరులోచూడడానికి అచ్చం పక్కింటబ్బాయిలా కనిపించే కిరణ్ అబ్బవరంకు చాలా మంది అభిమానులు ఉన్నారు. త్వరలోనే తన ప్రియురాలితో కలిసి పెళ్లిపీటలెక్కనున్నాడీ ట్యాలెంటెడ్ హీరో.

తన మొదటి హీరోయిన్ రహస్య గోరఖ్‌ తో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. ఈ ఏడాది మార్చి 13న వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడీ ప్రేమ పక్షుల పెళ్లి ముహూర్తానికి సమయం ఆసన్నమైంది. హీరో ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కిరణ్‌ అబ్బవరం-రహస్య గోరక్‌ల వివాహం ఆగస్టు 22న జరగనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ముందుగా కేరళలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అక్కడ వరదలతో పరిస్థితి భయనకరంగా ఉంది. అందుకే పెళ్లి వేదికను కర్ణాటకకు మార్చినట్లు సమాచారం. కూర్గ్ వేదికగా కిరణ్‌ అబ్బవరం-రహస్యల వివాహం జరగబోతున్నట్లు సమాచారం. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా తాజాగా సంగీత్ వేడుక నిర్వహించారు. ఇందులో ఇరు కుటుంబ సభ్యులు సందడి చేశారు. కిరణ్ తో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను రహస్య తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్‌లో షేర్‌ చేసింది. అలాగే కాబోయే భర్తతో కలిసి ప్రత్యేక పూజలు ఆచరిస్తోన్న ఫొటోని కూడా షేర్‌ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.