NTRపై బాలీవుడ్ స్టార్ వివాదాస్పద వ్యాఖ్యలు !! బుద్ది చెప్పాల్సిందే
రీసెంట్‌గా వార్ సినిమాతో బాలీవుడ్‌లోనూ తన క్రేజేంటో చూపించారు యంగ్ టైగర్. బాలీవుడ్ లో మరో బిగ్ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారనే టాక్‌తో నార్త్ టౌన్‌లో వైరల్ అవుతున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ నటుడు, ప్రముఖ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్.. మన స్టార్ హీరో పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దాంతో తారక్ ఫ్యాన్స్ కమల్ ఆర్ ఖాన్ పై మండిపడ్డారు.
కమల్ ఆర్ ఖాన్..! ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈయన. గతంలో పలువురు సెలబ్రెటీల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పెద్ద పెద్ద హీరోలు , హీరోయిన్స్ పై కూడా చాలా సార్లు నోరు పారేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఇదే కమల్ ఆర్ ఖాన్ తారక్ పై కూడా నోరు పారేసుకున్నాడు. వార్ 2 సినిమా నిరాశపరచడం పై KRK తాజాగా రియాక్టయ్యాడు. బాలీవుడ్ లో ఎన్టీఆర్ కెరీర్ అయిపోయింది అని కామెంట్స్ చేశాడు. వార్ 2 రిజెల్ట్ తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ హృతిక్ రోషన్ తో క్రిష్4 చేయకూడదని నిర్ణయం తీసుకుందని.. అలాగే దర్శకుడు ఆయాన్ ముఖర్జీని ధూమ్ 4 నుంచి కూడా తప్పించారని ఆయన చెప్పుకొచ్చాడు.అంతేకాదు ఎన్టీఆర్ తో కమిట్ అయిన సినిమాలను కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ రద్దు చేసుకున్నారని కమల్ ఆర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.. ఎన్టీఆర్ బాలీవుడ్ సినీ కెరియర్ వార్ 2 సినిమాతోనే ముగిసిపోయింది అంటూ కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. కమల్ ఆర్ ఖాన్ పై ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కమల్ ఆర్ ఖాన్ ను ట్రోల్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టెంపర్ సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఫలితం NTR ఖాతాలో దిమ్మతిరిగే హిట్
వరస ప్రాజెక్ట్‌లతో సత్తా చూపిస్తున్న భీమ్స్
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. మూడురోజులు భారీ వర్షాలు
