ఆ టైంలో సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా..స్టార్ నటి షాకింగ్ కామెంట్స్ వీడియో

|

Feb 17, 2025 | 6:59 AM

ప్రధాని నరేంద్రమోదీ పరీక్షా పే చర్చను కాస్త వెరైటీగా నిర్వహించారు. ఈసారి బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె పాల్గొన్నారు. ఆమెకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ను ప్రధాని తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశారు. దీపిక, తాను మానసిక ఆందోళనకు గురైన ఆనాటి రోజులను స్టూడెంట్స్‌తో షేర్‌ చేసుకున్నారు. ఆ సమయంలో తాను డిప్రెషన్‌కు లోనై సూసైడ్‌ ఆలోచనలు వచ్చేవని తెలిపారు. ఒత్తిడిని జయించడం ఎలా? మానసికంగా ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే అంశంపై విద్యార్థులతో ముచ్చటించారు. చదువు, క్రీడలు, మోడలింగ్‌.. ఆ తర్వాత యాక్టింగ్‌.

ఇలా దీపికా తన జీవితంలో ఎన్నో మార్పులను చూశానని చెప్పారు. 2014 తర్వాత కుంగుబాటుకు గురయినట్లు దీపికా తెలిపింది. తాను ముంబయిలో ఒంటరిగా ఉండటం వల్ల చాలా కాలంపాటు కుంగుబాటు సమస్యను ఎదుర్కొన్నానని చెప్పింది దీపికా. ఓసారి తన తల్లితో తొలిసారిగా తన బాధను షేర్‌ చేసుకున్నానని చెప్పుకొచ్చింది. బతకాలని లేదని దీపికా చెప్పడంతో తన తల్లి సైకాలజిస్ట్‌కు చూపించిందని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.కంటికి కనిపించిన ఒత్తిడి అనుక్షణం దెబ్బతీస్తుంది. ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు అనేవి ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఎదుర్కొనేవే. వాటి గురించి భయపడొద్దు. ఇతరులతో షేర్‌ చేసుకుంటేనే భారం దిగిపోతుంది. సమస్యను అణచుకుని బాధపడొద్దు. ధైర్యంగా బయటకు చెప్పాలని దీపిక సూచించింది.

మరిన్ని వీడియోల కోసం : 

షాపింగ్ చేస్తూ ప్యాంటె పాకెట్లో ఫోన్ పెట్టుకున్న మహిళ.. ఒక్కసారిగా అంతా షాక్ వీడియో

12 అడుగుల గిరి నాగు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. చూసి తీరాల్సిందే!వీడియో

అగ్గిపెట్టె అంత రూమ్.. అద్దె మాత్రం రూ.25 వేలు… ఓ బ్యాచిలర్‌ కష్టాల వీడియో