షూటింగ్‌ పేరుతో అడవిలో మంటలు.. హీరోకు వార్నింగ్ ఇచ్చిన గ్రామస్థులు

|

Jan 21, 2025 | 3:39 PM

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ కాంతార ప్రీక్వెల్.. కాంతార మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇప్పుడు బిగ్ ఝలక్ తగిలింది. ఈ మూవీ షూటింగ్‌ పై మేకర్స్‌ తీరుపై.. గ్రామస్థులు అసహనం వ్యక్తం చేయడం, అడ్డుకోవడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని కుందాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

ఈ సినిమాలోనూ గ్రామీణ నేపథ్యంతో పాటు అక్కడి దేవతామూర్తుల కథను తెలుపనున్నాడు రిషబ్. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో భాగంగా.. అటవీ ప్రాంతంలో నిప్పంటించారట ఈ మూవీ మేకర్స్. దీంతో ఆ చుట్టుపక్కల గ్రామస్తులు ఈ మూవీ టీంపై సీరియస్ అవుతున్నారు. అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించిన గ్రామస్తులు చిత్రబృందం చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అడవిలో మంటలు చెలరేగడంతో జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయన్నారు గ్రామస్థులు. వన్యప్రాణులు ఉన్న ప్రాంతంలో షూటింగ్ చేయకూడదన్నది గ్రామస్తుల డిమాండ్. వెంటనే షూటింగ్ ఆపి పర్యావరణాన్ని కాపాడండి. లేనిపక్షంలో డీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు. మరి దీని పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. నాలుగు ఆకులు తిన్నారంటే రోగాలన్నీ పరార్

కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడాడు ! చివరకు..

వీళ్లే నిప్పంటిస్తారు..వీళ్లే ఆర్పుతారు.. ఇదేం పైత్యమో..!