తమన్నాతో బ్రేకప్ వార్తలపై విజయ్ వర్మ రియాక్షన్ వీడియో

Updated on: Apr 05, 2025 | 6:11 PM

టాలీవుడ్ లోని ప్రముఖ హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. ఇటీవల తమన్నా పలు బాలీవుడ్ సినిమాల్లోనూ స్పెషల్‌ సాంగ్స్‌లో యాక్ట్‌ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్లు గతంలో తమన్నా స్వయంగా వెల్లడించారు. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ సందర్భంగా జరిగిన పరిచయం తామిద్దరి మధ్య ప్రేమకు దారితీసిందని చెప్పారు. వర్మ, తమన్నా దాదాపు రెండేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే, తాజాగా వీరిద్దరూ విడిపోయారని ప్రచారం జరుగుతోంది.

అందుకు తగ్గట్లుగానే తమన్నా, వర్మలు జంటగా కనిపించడమే లేదు. ఏ కార్యక్రమానికైనా విడివిడిగానే హాజరవుతున్నారు. ఇటీవల రవీనా టాండన్‌ నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లోనూ తమన్నా ఒంటరిగానే పాల్గొన్నారు. ఈ క్రమంలో తమన్నాతో బ్రేకప్ వార్తలపై విజయ్ వర్మ తాజాగా స్పందించారు. రిలేషన్‌షిప్‌లోని ప్రతి విషయాన్ని ఆనందించాలని అన్నారు. ఒక ఐస్‌క్రీమ్‌ మాదిరిగా ఆద్యంతం ఆస్వాదించాలని, అప్పుడే సంతోషంగా ఉంటామని చెప్పారు. సంతోషంతో పాటు బాధను, చిరాకును, కోపాన్నీ.. ఇలా ప్రతీ అంశాన్నీ స్వీకరించాలని హితవు పలికారు. అప్పుడే ఆ బంధం చిరకాలం కొనసాగుతుందన్నారు. బ్రేకప్ వార్తలపై తమన్నా కూడా ఇటీవల పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రిలేషన్ షిప్ లో ఉన్నప్పటి కంటే లేనప్పుడే తాను ఆనందంగా ఉన్నానని చెప్పారు. ప్రేమను వ్యాపార లావాదేవీలాగా చూడడం మొదలుపెడితే సమస్యలు తప్పవని చెప్పారు. అదే సమయంలో భాగస్వామి ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ తమన్నా ట్వీట్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న విమానంలో పొగలు.. వీడియో

టీ, కాఫీ తాగితే నిజంగానే తల నొప్పి తగ్గుతుందా?

తప్పిపోయిన బాలికను పట్టించిన డ్రోన్‌ కెమెరా వీడియో

ఖతర్నాక్‌ దొంగలు.. రూ.100 చూపించి.. రూ.1.50 లక్షలు కొట్టేశారు వీడియో