Varasudau Movie: వెనకడుగు వేసిన దిల్ రాజు చిరు, బాలయ్య సినిమాలకు లైన్ క్లియర్..!
వారసుడు సినిమా సంక్రాంతికి రిలీజ్ ఏమో కాని.. తాజాగా ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్‌ను తీసుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ 11th జాన్ దగ్గర పడుతున్న వేళ..
వారసుడు సినిమా సంక్రాంతికి రిలీజ్ ఏమో కాని.. తాజాగా ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్‌ను తీసుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ 11th జాన్ దగ్గర పడుతున్న వేళ.. ఈసినిమా రిలీజ్ పోస్ట్ పోయిన్ అయ్యే అవాకాశాలు ఉన్నాయనే టాక్… ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బయటకొచ్చేసింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్‌లో భాగమా.. లేక సినిమా డబ్బింగ్‌లో డిలేనే ఇందుకు కారణమా అనే డౌట్స్ అందరిలో కలిగేలా చేస్తోంది. ఇక విజయ్ వారిసు సినిమాను ఎంత ప్రస్టేజియస్ గా ప్రొడ్యూస్ చేశారో .. అంతే ప్రిస్టేజియస్ గా రిలీజ్ ప్లాన్ చేశారు దిల్ రాజు. అటు తమిళ్ స్టార్ హీరో అజిత్ కంటే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇటు బాలయ్య, చిరు సినిమాలకు సమానంగా థియేటర్లను సంపాదించేశారు. ఎవరు ఏమన్నా తన సినిమానే.. తన బిజినెస్సే ముఖ్యం అన్న కామెంట్స్ తో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తెలుగు తమిల్లో.. ఒకేసారి జాన్ 11th రిలీజ్ అంటూ అనౌన్స్ చేసి.. అంతటా హాట్ టాపిక్ గా మారారు.కాని ఫిల్మీ రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతం టాలీవుడ్‌లో దిల్ రాజు వెనకడుగు వేశారట. తమిళ్లో చెప్పిన రోజే.. వారిసు సినిమాను రిలీజ్ చేస్తున్నప్పటికీ.. తెలుగు లో మాత్రం డబ్బింగ్ పనులు పూర్తవక పోవడంతో.. రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయనున్నారట. జాన్ 14th న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. అయితే ఈ న్యూస్ అఫీషియల్ కానప్పటికీ.. ఇండస్ట్రీలో మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. మరి ఈ న్యూస్ పై దిల్ రాజు ఏం చెబుతారో చూడాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos