Maharaja: అప్పుడే OTTలోకి వస్తున్న 100 కోట్లసూపర్ హిట్ మూవీ..
చాలా రోజుల తర్వాత మహారాజ సినిమాతో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విజయ్ సేతుపతి. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే వంద కోట్ల వసూళ్లు దాటేసింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విజయ్ సేతుపతి సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మహారాజ పేరుతోనే డబ్ అయిన ఈ సినిమకు ఇప్పటివరకు తెలుగు నాట సుమారు 20 కోట్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
చాలా రోజుల తర్వాత మహారాజ సినిమాతో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విజయ్ సేతుపతి. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే వంద కోట్ల వసూళ్లు దాటేసింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విజయ్ సేతుపతి సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మహారాజ పేరుతోనే డబ్ అయిన ఈ సినిమకు ఇప్పటివరకు తెలుగు నాట సుమారు 20 కోట్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్పటికీ థియేటర్లలో ఆడియెన్స్ ను అలరిస్తోన్న మహారాజ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఒక ఆసక్తిక వార్త వినిపిస్తోంది.
ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ నెట్ ఫ్లిక్స్ మక్కల్ సెల్వన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జులై 19 నుంచి మహారాజ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగులోనూ అదే రోజు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని టాక్. త్వరలోనే మహారాజ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది
నితిలన్ సామినాథన్ తెరకెక్కించిన మహారాజ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, అభిరామి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో మహారాజ అలియాస్ విజయ్ సేతుపతి ఓ బార్బర్. తన కూతురితో కలిసి నగరానికి దూరంగా ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. అయితే ఓ రోజు కొందరు దుండగులు మహరాజ ఇంటిపై దాడిచేసి లక్ష్మిని ఎత్తుకుపోయారని మహారాజ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. మరి ఇంతకు లక్ష్మి ఎవరు? మహారాజ కంప్లైంట్‌ను పోలీసులు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు. తన కూతురిపై జరిగిన అన్యాయానికి మహారాజ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నదే ఈ మూవీ కథ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.