నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌… మెగాస్టార్‌కి ఊరట!

Updated on: Jan 13, 2026 | 5:10 PM

బతుకు బతకనివ్వు, అందరూ కలిసి ఎదగాలనే కాన్సెప్ట్‌పై విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్ అయింది. నెగటివ్ రివ్యూలతో సినిమాలను చంపేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ సినిమాకు బుక్ మై షోలో రేటింగ్‌లు, రివ్యూలు నిలిపివేయడంపై సినీ వర్గాల్లో ఆశలు రేగాయి. ఇది పరిశ్రమకు ఒక మంచి ముందడుగుగా భావిస్తున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో నెగిటివ్ రివ్యూల ప్రభావంపై విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “బతుకు బతకనివ్వు, అందరూ కలిసి ఎదగాలి” అనే కాన్సెప్ట్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. డియర్ కామ్రేడ్ సమయంలో చూసిన కొన్ని రాజకీయాల వల్ల నిద్రలేని రాత్రులు గడిపానని, తన అప్పటి బాధ ఇప్పుడు చాలా మందికి అర్థమవుతుందని విజయ్ పేర్కొన్నారు. సినిమాలను నెగిటివ్ రివ్యూలతో దెబ్బతీస్తున్న వారిపై పరిశ్రమలో తీవ్ర ఆందోళన నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ సినిమాకు బుక్ మై షోలో రేటింగ్‌లు, రివ్యూలను నిలిపివేయడంపై విజయ్ దేవరకొండ స్పందించారు.

మరిన్ని వీడియోల కోసం :

తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..

బ్రష్​ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి

నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం