ఎంగేజ్ మెంట్ రింగ్ తో కనిపించిన విజయ్ దేవరకొండ

Updated on: Oct 06, 2025 | 11:04 PM

నటుడు విజయ్ దేవరకొండ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఎంగేజ్మెంట్ రింగ్‌తో కనిపించారు. సత్యసాయి బాబా మహా సమాధి దర్శనం కోసం కుటుంబంతో వెళ్లిన విజయ్ ఎడమ చేతి వేలికి ఉంగరం ఉండటం చర్చనీయాంశంగా మారింది. రష్మిక మందనాతో సీక్రెట్‌గా నిశ్చితార్థం జరిగిందని ప్రచారం ఉన్నా, విజయ్ దేవరకొండ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

నటుడు విజయ్ దేవరకొండ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సందడి చేశారు. ఇవాళ సత్యసాయి బాబా మహా సమాధి దర్శనం కోసం కుటుంబ సమేతంగా పుట్టపర్తికి వెళ్లిన విజయ్ దేవరకొండ ఎడమ చేతి వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది. ఇటీవలి కాలంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందనాతో సీక్రెట్‌గా నిశ్చితార్థం జరిగిందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ వేలికి ఉంగరం కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది. అయితే, ఈ నిశ్చితార్థంపై విజయ్ దేవరకొండ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకాశంలో కనువిందు చేయనున్న ఆరెంజ్ మూన్

పడగలో పల్లెలు.. పగబట్టినట్లు వరుసగా పాము కాట్లు

పెద్ది అప్‌డేట్స్ విషయంలో సైలెన్స్‌

జోరు చూపిస్తున్న రాజాసాబ్‌.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఎలర్ట్ చేస్తున్న మేకర్స్

గుడ్‌ న్యూస్‌ చెప్పిన గీతా గోవింద్‌