విజయ్-రష్మికల పెళ్లి ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే ??

Updated on: Nov 08, 2025 | 3:22 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి వార్తలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. చేతికి ఉంగరాలు, రష్మిక వ్యాఖ్యలతో నిశ్చితార్థంపై ఊహాగానాలు పెరిగాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. ఈ సెలబ్రిటీ జంట పెళ్లిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా జోడీ మరోసారి ట్రెండ్ అవుతోంది. నెట్టింట వీరి పెళ్లి వార్తలు మళ్లీ గుప్పుమంటున్నాయి. ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ అయినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కానీ రష్మిక, విజయ్ చేతులకు ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉన్నాయని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని తెగ సంతోషపడిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా వీరి పెళ్లి మూహూర్తంపై చర్చ మొదలైంది. విజయ్-రష్మిక పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అని తెగ చర్చ జరుగుతోంది. వీళ్లు సింపుల్ గా పెళ్లి చేసుకుంటారా? లేదా డెస్టినేషన్ వెడ్డింగా? అని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. కొందరైతే ఏకంగా పెళ్లి ముహూర్తం, వేదిక కూడా ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కటి కానున్నారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరలవుతోంది. 26వ తేదీన విజయ్-రష్మికల పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారని ఇందులో ఉంది. అలాగే రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని కోట ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు వేదిక కానుందని ఒక వార్త హల్ చల్ చేస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడీ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన రష్మిక మందన్నా తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన చేతికి ఉన్న రింగ్స్ లో ఒకటి చాలా స్పెషల్ అని చెప్పింది. ఈ విషయంలో జనాలు ఏమనుకున్నా తనకు సంతోషమేనంది. తద్వారా విజయ్ తో తనకు నిశ్చితార్థం జరిగినట్లు చెప్పకనే చెప్పింది. విజయ్ రష్మిక కెరీర్ గురించి చూసుకుంటే.. విజయ్ కంటే రష్మికనే వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది.రష్మిక మందన్న ప్రొఫెషనల్‌గా చాలా బిజీగా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

The Girlfriend: ఒక్కో యాంగిల్ లో ఒక్కోలా…హిట్టా.? ఫట్టా..?

Jr NTR: సన్నగా కాదు.. సైలెంట్‌గా దిగే బాకు

Jatadhara: కథగా ఓకే కానీ.. హిట్టా..? ఫట్టా..?

Bigg Boss Telugu 9: తారుమారైన ఓటింగ్.. ఊహించని కంటెస్టెంట్‌ డేంజర్‌ జోన్‌లో

ChatGPT: ఇండియాలో చాట్​‌ జీపీటీ.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ