Venkatesh: ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై వెంకటేష్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్

Edited By:

Updated on: Jan 23, 2026 | 5:25 PM

వెంకటేష్ కెరీర్ ప్లానింగ్ అద్భుతంగా ఉంది. 60 దాటినా బాక్సాఫీస్‌పై పట్టు నిలుపుకుంటూ, రాబోయే ప్రాజెక్ట్‌లతో సంచలనం సృష్టించనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం' సమ్మర్‌లో రానుండగా, 'దృశ్యం 3' అక్టోబర్ నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. అనిల్ రావిపూడితో 2027 సంక్రాంతికి మరో భారీ చిత్రం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలు భారీ వసూళ్లను సాధించే సత్తా కలిగి ఉన్నాయి.

60 దాటిన తర్వాత మన సీనియర్ హీరోలకు మహర్దశ పట్టేసింది.. మొన్నటి వరకు బాలయ్య రప్ఫాడించారు.. ఇప్పుడు చిరంజీవి, వెంకటేష్ దున్నేస్తున్నారు. మరీ ముఖ్యంగా వెంకీ మామ ప్లానింగ్ మామూలుగా లేదు. వచ్చిన మార్కెట్ నిలబెట్టుకోడానికి నెక్ట్స్ లెవల్ ప్లాన్ చేస్తున్నారు. మరి అదేంటి.. విక్టరీ హీరో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి..? గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ కొట్టిన వెంకీ.. ఈసారి మన శంకరవరప్రసాద్ గారులోనూ తనదైన సాయం చేసారు. సోలో హీరోగానూ వెంకీ ప్లాన్ పీక్స్‌లో ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నారీయన.. సమ్మర్‌లోనే విడుదల కానుంది ఈ చిత్రం. ఫ్యామిలీస్‌కు కనెక్ట్ అయితే.. ఆదర్శ కుటుంబానికి వసూళ్ల వర్షం ఖాయం. దర్శకులు, కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు వెంకీ. త్రివిక్రమ్ తర్వాత దృశ్యం 3 లైన్‌లో ఉంది. ఈ సినిమా మలయాళం షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది.. తెలుగు రీమేక్ షూట్ అక్టోబర్ నుంచి మొదలు కానుందని సురేష్ బాబు కన్ఫర్మ్ చేసారు. దృశ్యం థియేటర్లలో హిట్ అవ్వగా.. దృశ్యం 2 కరోనా టైమ్‌లో ఓటిటిలో మంచి అప్లాజ్ తెచ్చుకుంది. అనిల్ రావిపూడితో 2027 సంక్రాంతికి మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు వెంకటేష్. ప్రస్తుతం ఈయన కమిటైన సినిమాలన్నీ మినిమమ్ గ్యారెంటీ.. త్రివిక్రమ్, అనిల్ సినిమాలకు 200 కోట్ల క్యాపబిలిటీ ఉంది.. దృశ్యం 3 వర్కవుట్ అయితే 100 కోట్లు పక్కా. మొత్తానికి రాబోయే 3 సినిమాలతో బాక్సాఫీస్‌పై వార్ ప్రకటించారు వెంకీ మామ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Top 9 ET: అన్న విజయానికి తమ్ముడి క్రేజీ రియాక్షన్ | బాస్‌ దెబ్బకు..కళ్ల ముందుకు గత వైభవం

టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్

పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..

రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు.. చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు

పాపం గూగుల్‌ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని

Published on: Jan 23, 2026 05:23 PM