Chhaava: సంచలనంగా ఛావా కలెక్షన్స్‌ !! కోట్లు కొల్లగొడుతున్న బాలీవుడ్ మూవీ..!

Updated on: Feb 19, 2025 | 6:24 PM

ఆఫ్టర్ స్త్రీ2...! ఆరేంజ్‌ హిట్ లేక సైలెంట్ అయిన బాలీవుడ్‌కు ఛావా సినిమా బిగ్ బూస్ట్ నిచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌ కుమ్మేస్తుండడం ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది. విక్కీ కౌషల్ యాక్టింగ్ గురించి కూడా అందరూ మాట్లాడుకునే లా చేస్తోంది. ఇక లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో... విక్కీ కౌషల్, రష్మిక లీడ్‌ రోల్ చేసిన సినిమా ఛావా.

మారాఠా కింగ్ ఛత్రపతి శివాజీ జీవింతంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా.. దాదాపు 130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈసినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్స్‌లోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ మూవీ దిమ్మతిరిగే కలెక్షన్స్‌ వచ్చేలా చేసుకుంటోంది. ఇక బాక్సాఫీస్‌ లెక్కల ప్రకారం ఈ మూవీ డే1 కేవలం 33 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించిన ఈ మూవీ.. ఆ తర్వాత అనూహ్యంగా పెరిగిన రెస్పాన్స్‌ తో కలెక్షన్ల రేస్‌లో దూసుకుపోవడం షురూ చేసింది. అలా రిలీజైన నాలుగు రోజుల్లోనే దాదాపు 121 కోట్లను వసూలు చేసింది ఈ సినిమా. అంతేకాదు విక్కీ కౌషల్ యాక్టింగ్‌కు అప్రిషియేషన్ రావడం కూడా కామన్ అయిపోయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడు రోజులుగా ఆసుపత్రిలో… అయినా మాట కోసం బయటికి వచ్చిన సుధీర్

విడాకుల ఖరీదు రూ.60 కోట్లు..! పాపం క్రికెటర్ !