అదుర్స్ నా బయోపిక్కే..వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

Updated on: Jan 18, 2026 | 12:39 PM

వేణుస్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్పడమే కాకుండా పూజలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఆయన చేసిన ఓ వ్యాఖ్య నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం అదుర్స్ తన బయోపిక్ అని, అందులోని రెండు పాత్రలు తనవేనని వేణుస్వామి పేర్కొన్నారు. పూజా సమయంలో కొబ్బరికాయలో పువ్వు రావడంతో సినిమా విజయం ఖాయమని అప్పుడే ఎన్టీఆర్‌తో చెప్పానని వివరించారు.

వేణుస్వామి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ, వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. సామాన్యులతో పాటు పలువురు సినీ తారలు కూడా వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. గతంలో అనేక విజయవంతమైన చిత్రాలకు వేణుస్వామి పూజలు నిర్వహించారు. స్టార్ హీరోల సినిమాలకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమా అదుర్స్ తన బయోపిక్ అని వేణుస్వామి పేర్కొనడం అందరినీ షాక్ అయ్యేలా చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

సీఎంను చిప్స్‌ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్‌ ఇదే!

అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!

ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంటే..

కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!