Varanasi: హమ్మయ్య! తలనొప్పి నుంచి తప్పించుకున్న జక్కన్న

Updated on: Dec 01, 2025 | 4:50 PM

వారణాసి సినిమా టైటిల్ వివాదం సుఖాంతమైంది. రామభక్త హనుమ నిర్మాణ సంస్థ అభ్యంతరాలను తొలగిస్తూ, రాజమౌళి తన పేరును జోడించి తెలుగులో 'రాజమౌళి వారణాసి'గా విడుదల చేయనున్నారు. ఇతర భాషల్లో 'వారణాసి' పేరుతోనే వస్తుంది. 100కు పైగా దేశాల్లో విడుదల కానున్న ఈ సినిమాకు త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

మొత్తానికి శుభం కార్డ్‌ పడింది. వారణాసి ఇష్యూకు ఆల్మోస్ట్ తెరపడిపోయింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తమ వారణాసి టైటిల్లో చిన్న చేంజ్‌ చేసేందుకు తమకేం అభ్యంతరం లేదని రామభక్త హనుమ నిర్మాణ సంస్థ చెప్పడంతో… రాజమౌళి టీం రెడీ అయిపోయిందని తెలుస్తోంది. ముందు నుంచి అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్టే.. వారణాసి సినిమా పేరు ముందు తన పేరును జోడించిన రాజమౌళి.. ఆ పేరును రిజిస్టర్ చేయిస్తున్నట్టు సమాచారం. దాదాపు 100కి పైగా దేశాల్లో రిలీజ్ కానున్న వారాణసి మూవీని తెలుగులో..రాజమౌళి వారణాసి పేరుతో రిలీజ్ చేస్తుండగా… రిమైనింగ్ లాగ్వేంజెస్‌లో మాత్రం వారణాసి పేరుతోనే రీలిజ్ చేయనున్నట్టు సమాచారం. అయితే, ఈ విషయంపైనా ఇరువురి మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాత కామిక్ బుక్ ధర అక్షరాల రూ.81 కోట్లు.. ఏ మాత్రం తగ్గనిసూపర్ మ్యాన్ క్రేజ్

ఇండియాలోనే ఖరీదైన నెంబరు ప్లేట్‌.. ధర ఎంతో తెలుసా ??

ఆ ఊర్లో సూర్యుడికి 64 రోజుల సెలవు

CM Revanth Reddy: ఫుట్‌బాల్‌ దిగ్గజంతో తలపడనున్న సీఎం రేవంత్‌

వామ్మో.! తుఫాన్.. ఏపీలో ఆ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్