ఖుషీ రీ-రిలీజ్‌కు ఎదురు దెబ్బ !! ‘నో’ చెప్పిన డిస్ట్రిబ్యూటర్స్ !!

|

Dec 30, 2022 | 9:34 AM

గ్రాండ్‌ గా రీ రిలీజ్‌ చేద్దామనుకున్న ఖుషీ సినిమాకు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాను మరో సారి చూద్దామనుకున్న పవన్‌ ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశే మిగిలింది. డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలొస్తాయంటూ నో చెప్పడమే...

గ్రాండ్‌ గా రీ రిలీజ్‌ చేద్దామనుకున్న ఖుషీ సినిమాకు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాను మరో సారి చూద్దామనుకున్న పవన్‌ ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశే మిగిలింది. డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలొస్తాయంటూ నో చెప్పడమే… ఇప్పుడు అంతటా చర్చగా మారింది. ఎస్ ! పవన్‌ ఫ్యాన్స్ డిమాండ్‌ మేరకు.. ఖుషీ సినిమాను డిసెంబర్ 31న రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రెండు రోజుల క్రితం ఖుషీ రీరిలీజ్ ట్రైలర్‌ను కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసి.. ట్రెండ్ అయ్యారు. ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై థియేటర్లో చూసేందుకు అందరూ ఎదురుచూసేలా చేసుకున్నారు. అయితే ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌అవుతుందనుకున్న క్రమంలో.. యూఎస్ థియేటర్‌ డిస్ట్రిబ్యూటర్స్ చేతులెత్తేశారు. థియేటర్‌ రెంట్లు రీ రిలీజ్ సినిమాల కలెక్షన్లు నక్కకు నాగలోకాని అన్నట్టు ఉండడంతో.. తమకు నష్టాలొస్తున్నాయని అంటున్నారు. గతంలో కూడా ఇదే జరిగిందని.. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందని.. అందుకే రీ రిలీజ్‌ సినిమాలను రిలీజ్ చేయడంలేదని అంటున్నారు. తమను అప్రోచ్‌ అయిన ఫ్యాన్స్ కు నిర్ధాక్షిణ్యంగా నో చెబుతున్నారు. తమ ఆన్సర్‌తో మాటలతో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌ గా మారారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dil Raju: ‘పవన్‌ కారణంగా.. చాలా నష్టపోయా’

Published on: Dec 30, 2022 09:34 AM