జనవరి నుంచి సమ్మర్ వరకు.. క్రేజీ సినిమాల జాతర

Edited By:

Updated on: Jan 26, 2026 | 6:33 PM

ఈ సమ్మర్ సీజన్లో అనేక క్రేజీ తెలుగు, పాన్-ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి. సంక్రాంతి తర్వాత మీడియం రేంజ్ హీరోల చిత్రాలతో పాటు భారీ ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, అదివి శేష్, నిఖిల్ వంటి హీరోల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పాన్-ఇండియా సినిమాలకు VFX క్వాలిటీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ సీజన్ సినీ ప్రేమికులకు భారీ వినోదాన్ని పంచనుంది.

సమ్మర్ అంటే అంతా భారీ సినిమాల గురించే మాట్లాడుకుంటారు కానీ ఈ సీజన్‌లో చాలా వరకు క్రేజ్ మూవీస్ వస్తున్నాయి. వర్కవుట్ అయితే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయగల సత్తా ఉన్న సినిమాలే అవన్నీ. అందులోనే ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ సైతం ఉన్నాయి. మరి ఈ సీజన్ నుంచి సమ్మర్ వరకు రాబోయే ఆ క్రేజీ సినిమాలేంటో చూద్దామా..? సంక్రాంతి సినిమాల హడావిడి తగ్గిన తర్వాత అందరూ పెద్ది, ప్యారడైజ్, ఉస్తాద్ అంటూ మాట్లాడుకుంటున్నారు కానీ.. కొందరు మీడియం రేంజ్ హీరోలు కూడా ఈ సీజన్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. తరుణ్ భాస్కర్ ఓం శాంతి శాంతి శాంతి: సినిమా జనవరి 30న రానుంది. ట్రైలర్‌తోనే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగిపోయింది.. ఈషా రెబ్బా ఇందులో హీరోయిన్. ఫిబ్రవరిలోనూ వరసగా క్రేజీ సినిమాలు రానున్నాయి. 6న గుణశేఖర్ యుఫోరియా విడుదల కానుంది.. అలాగే ఫిబ్రవరి 13న ఫంకీ రానుంది.. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనుదీప్ కేవీ తెరకెక్కిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తుంది. అలాగే శ్రీ విష్ణు ఎంటర్‌టైనింగ్ సినిమా విష్ణు విన్యాసం కూడా ఫిబ్రవరిలోనే రానుంది. దీనిపై అంచనాలు బానే ఉన్నాయి. అడివి శేష్ డెకాయిట్ సినిమా ప్యాన్ ఇండియన్ స్థాయిలో మార్చి 19న విడుదల కానుంది. శేష్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉండటం డెకాయిట్‌కు కలిసొచ్చే విషయం. అలాగే కమిటి కుర్రోళ్లు తర్వాత నిహారిక నిర్మిస్తున్న రాకాస సినిమా ఎప్రిల్ 3న విడుదల కానుంది. సంగీత్ శోభన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. స్వయంభు కోసం ఇండియాస్ టాప్ VFX కంపెనీలు పని చేస్తున్నాయి. గ్రాఫిక్స్ బాగోలేకపోతే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. అందుకే క్వాలిటీ ఔట్‌పుట్ కోసమే టైమ్ తీసుకుంటున్నారు మేకర్స్. ఈ చిత్రం ఎప్రిల్ 10న రిలీజ్ కానుంది. కార్తికేయ 2 తర్వాత మరోసారి ప్యాన్ ఇండియాపై ఫోకస్ చేసారు నిఖిల్. మొత్తానికి ఈ సీజన్ అంతా క్రేజీ సినిమాలే రానున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది

గాంధీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. మహిళకు పునర్జన్మ

బాబోయ్‌ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు

‘ఆ అంకుల్స్ నాతో చండాలంగా ప్రవర్తించారు’ హీరోయిన్ ఎమోషనల్

‘పెళ్లికి ముందే అమ్మాయితో అసభ్యంగా దొరికాడు.. కోపంతో చితకొట్టిన క్రికెటర్’