బెస్ట్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకోవడంపై ఉపాసన తీవ్ర ఆవేదన
హైదరాబాద్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య ప్రస్తుతం త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోని సెలబ్రిటీలందరకికీ ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్న ప్రత్యూష ఇలా డిప్రెషన్ తో సూసైడ్ చేసుకోవడం అందర్నీ కలిచి వేస్తోంది.
హైదరాబాద్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య ప్రస్తుతం త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోని సెలబ్రిటీలందరకికీ ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్న ప్రత్యూష ఇలా డిప్రెషన్ తో సూసైడ్ చేసుకోవడం అందర్నీ కలిచి వేస్తోంది. దీంతో చాలా మందిసెలబ్రిటీలు రెస్ట్ పీస్ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రామ్ చరణ్ వైఫ్ ఉపాసన.. ప్రత్యూష మరణంపై ఎమోషనల్ అయ్యారు. “ప్రత్యూష నా డియరెస్ట్ ఫ్రెండ్. చాలా త్వరగానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రతి విషయంలోనూ ఆమె ఉన్నతంగ ఆలోచించేది. కెరీర్ పరంగా, కుటుంబం, స్నేహితుల పరంగానూ ఉన్నత నిర్ణయాలే తీసుకునేది. అన్ని విషయాల్లో ఉన్నతంగా ఆలోచించే ప్రత్యూష డిప్రెషన్‌కు గురి కావడం బాధ కలిగిస్తోంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి” ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యారు ఉపాసన.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ బీ కి ట్వీట్‌కు ఉబ్బితబ్బిబైన మహేష్ !! థాంక్స్ అంటూ రీట్వీట్
పాన్ ఇండియా పై రానా షాకింగ్ కామెంట్స్ !! విరాట పర్వం కూడా అందుకే చేయలేదట !!