కొన్ని ఘటనలు నన్ను భయపెట్టాయి.. అందుకే పాపకు మాస్క్ వేస్తున్నాం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాలపట్టి క్లీంకారను చూడాలని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాప పుట్టినప్పటి నుంచి ఆమె ముఖాన్ని ఇప్పటివరకు బయట ప్రపంచానికి చూపించలేదు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు చిన్నారిని చూద్దామా అని ఆత్రుత కనబరుస్తున్నారు. కాగా, పాప ముఖం రివీల్ చేయకపోవటం వెనక కారణాన్ని తాజాగా ఓ కార్యక్రమంలో ఉపాసన మాట్లాడారు.
దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఉపాసన మాట్లాడుతూ, “ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నాం. బయట జరుగుతున్న కొన్ని సంఘటనలు తల్లిదండ్రులుగా నన్ను, చరణ్‌ను చాలా భయపెట్టాయి. అందుకే మా పాపకు తగినంత స్వేచ్ఛను ఇవ్వాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లినప్పుడు కూడా పాప ముఖానికి మాస్క్ వేస్తున్నామని, అది కాస్త కష్టమైన పనే అయినా.. అది అవసరమని తాము భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ‘మేము చేస్తున్నది కరెక్టా కాదా అనేది మాకు తెలీదు. కానీ, పాప ముఖాన్ని రివీల్ చేయకపోవటం అనే విషయంలో మాత్రం మేం సంతోషంగానే ఉన్నాం. ఇప్పట్లో.. పాపను లోకానికి చూపించే ఆలోచనేమీ లేదు’ అని ఉపాసన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో తమ నిర్ణయం పట్ల వారు ఎంత కచ్చితంగా ఉన్నారో తేలిపోయింది. రామ్ చరణ్, ఉపాసనలకు 2012లో వివాహం కాగా, పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత 2023 జూన్ 20న క్లీంకారా జన్మించింది. పాప పుట్టినప్పటి నుంచి ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నా, ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. కనీసం మొదటి పుట్టినరోజు నాడైనా పాపను చూపిస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఉపాసన తాజా వ్యాఖ్యలతో, క్లీంకార ఫొటోల కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ప్రస్తుతానికి తెరపడినట్లయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వారం రోజుల్లో అన్ని ప్రైవేటు కాలేజీలు బంద్ కానున్నాయా !! మళ్లీ ఏమైంది
బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ అవుతున్న హీరోలు.. షూటింగ్ అప్డేట్స్ ఇవే
వెయ్యి కోట్ల వసూళ్ల రేసులో ఇండియన్ సినిమా
అంతకు మించి అనేలా ఉండబోతున్న AA 22.. హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్..
Baahubali: బాహుబలి టీంలో రీ రిలీజ్ జోష్.. క్రేజ్ మామూలుగా లేదుగా
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

