AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Udhayanidhi Stalin: సీఎం కొడుకు సినిమా రిలీజ్‌పై తీవ్ర ఉత్కంఠ..! ఎందుకింత సస్పెన్స్..

Udhayanidhi Stalin: సీఎం కొడుకు సినిమా రిలీజ్‌పై తీవ్ర ఉత్కంఠ..! ఎందుకింత సస్పెన్స్..

Anil kumar poka
|

Updated on: Jun 27, 2023 | 9:49 AM

Share

ది గ్రేట్ లీడర్‌ కరుణానిధి మనవడిగా.., సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఉధయననిధి స్టాలిన్.. తాజాగా మామన్నన్ సినిమానే తన చివరి సినిమా అంటూ.. అనౌన్స్ చేసి అందర్నీ షాకయ్యేలా చేశారు. తన తండ్రి స్టాలిన్ ప్రభుత్వంలో..

ది గ్రేట్ లీడర్‌ కరుణానిధి మనవడిగా.., సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఉధయననిధి స్టాలిన్.. తాజాగా మామన్నన్ సినిమానే తన చివరి సినిమా అంటూ.. అనౌన్స్ చేసి అందర్నీ షాకయ్యేలా చేశారు. తన తండ్రి స్టాలిన్ ప్రభుత్వంలో ఓ పక్క యూత్ వెల్‌ఫేర్ అండ్ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్ మినిష్టర్గా పని చేస్తూనే.. సినిమాలు చేయడం సరికాదనుకున్న ఆయన… తన తండ్రికి తోడుగా.. రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయంతో.. ఉదయనిధి కోర్టు నోటీసులు కూడా అందుకున్నారు. తన సినిమా ‘ఏంజిల్’ పూర్తి కాకుండా సినిమాల నుంచి ఎలా తప్పకుంటారంటూ..? ఆ సినిమా నిర్మాత రామశరవణన్ సీరియస్ అయ్యే వరకు కోర్టు కెక్కే వరకు తెచ్చుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ హీరో లేటెస్ట్ మూవీ మామన్నన్ మరో వివాదంలో చిక్కుకోవడంతో… కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌ అవుతున్నారు. ఎస్ ! మణి సెల్వరాజ్ డైరెక్షన్లో … ఉదయనిధి హీరోగా… పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో… తెరకెక్కిన సినిమానే మామన్నన్. ఇక కోలీవుడ్ లో మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీపై.. తాజాగా దక్షిణ తమిళనాడు లోని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్రుగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ లో కులాలను కించపరుస్తూ సంభాషణలు ఉన్నాయని , కులాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందంటూ ఆ పార్టీ నేతల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.

అంతేకాదు.. ఈ ఆరోపణలకు తోడే… జూన్ 29న రిలీజ్ అయ్యే ఈసినిమాను అడ్డుకుంటా మంటూ.. ఫార్వర్డ్ బ్లాక్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళన చేయడమే కాదు.. తమ తమను కాదని సినిమాను రిలీజ్‌ చేస్తే.. ఈ సినిమాను ప్రదర్శించే థియేటర్లను ముట్టడిస్తా మంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక దీనికి తోడు తేని జిల్లాల్లో మామన్నన్ మూవీ రిలీజ్‌ ఆపేయాలని రాత్రికి రాత్రే పోస్టర్లు వెలవడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ మూవీ విడుదల అవుతుందా.. లేదా అన్న దానిపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. అందర్లో ఉత్కంఠను కలిగిస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..