డైరెక్టర్‌ క్రిష్‌ను తిట్టేస్తున్న బన్నీ ఫ్యాన్స్.. వరుణ్ సినిమాకు భారీ డిమాండ్‌.. ఓసారి లుక్కేయండి..

డైరెక్టర్‌ క్రిష్‌ను తిట్టేస్తున్న బన్నీ ఫ్యాన్స్.. వరుణ్ సినిమాకు భారీ డిమాండ్‌.. ఓసారి లుక్కేయండి..

Ravi Kiran

|

Updated on: Sep 30, 2023 | 9:04 AM

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు.. పెద్ద హీరో సినిమానైనా.. చిన్న హీరో చిత్రమైనా.. ఆ మూవీ విశేషాలు, ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫస్ట్ డే కలెక్షన్లు, రివ్యూలు.. అన్నింటి కోసం వెల్ కమ్ టూ.. టాప్9 ఈటీ.. టుడే సెప్టెంబర్ 29th టాప్ 9 ఈటీ ఏంటో.. ఇప్పుడు క్విక్ గా చూసేద్దాం..!

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు.. పెద్ద హీరో సినిమానైనా.. చిన్న హీరో చిత్రమైనా.. ఆ మూవీ విశేషాలు, ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫస్ట్ డే కలెక్షన్లు, రివ్యూలు.. అన్నింటి కోసం వెల్ కమ్ టూ.. టాప్9 ఈటీ.. టుడే సెప్టెంబర్ 29th టాప్ 9 ఈటీ ఏంటో.. ఇప్పుడు క్విక్ గా చూసేద్దాం..!

01.Varun Tej

వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ఆపరేషన్ వాలంటైన్. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు వరుణ్ తేజ్. తాజాగా ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ఏకంగా 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలిపారు మేకర్స్. వరుణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ ఇది.

02.Allu Arjun

రెండు రోజులుగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో అల్లు అర్జున్ ఒక సినిమా చేయబోతున్నాడంటూ ఒక పోస్టర్, వీడియో వైరల్ అయింది. అది సినిమానా లేదంటే యాడా అనేది అర్థం కాలేదు ఫ్యాన్స్‌కు. ‘కబీ అప్నే, కబీ సప్నే’ అనే టైటిల్‌తో ప్రమోషన్స్ కూడా చేయడంతో క్యూరియాసిటీ పెరిగిపోయింది. తాజాగా ఆ యాడ్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఇది సినిమా అని నమ్మిన వాళ్లంతా.. తాజాగా డైరెక్టర్‌ క్రిష్‌ను.. తిట్టిపోస్తున్నారు. అయితే అది సీరియస్‌గా.. కాస్త ఫన్నీగానే లెండి.

03.Skanda

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 18.8 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. షేర్ కూడా 10 కోట్లకు పైగా వచ్చాయి. 50 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కంద వీకెండ్ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. అఖండ తర్వాత బోయపాటి తెరకెక్కించిన సినిమా ఇది.

04.Salaar

డిసెంబర్ 22నే రాబోతున్నట్లు సలార్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసారు మేకర్స్. వారం రోజులుగా ఇదే డేట్ అని ప్రచారం జరుగుతున్నా.. అధికారిక సమాచారం కోసం వెయిట్ చేసారు ఫ్యాన్స్. సంక్రాంతికి అయితే చాలా సినిమాలున్నాయి.. అలాగే సమ్మర్ చాలా లేట్ అయిపోతుంది.. అందుకే రిస్క్ అయినా పర్లేదని డిసెంబర్‌లోనే వచ్చేస్తున్నారు సలార్ టీం.

05.Animal

యానిమల్ మొదలైనప్పటి నుంచి అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు సందీప్. అసలు వయోలెన్స్ అంటే ఎలా ఉంటుందో ఇండియన్ సినిమాకు చూపిస్తానంటున్నారు. అన్నట్లుగానే ప్రీ టీజర్‌తోనే రక్తం చూపించిన ఈయన.. ఇప్పుడు టీజర్‌లో ఆ డోస్ మరింత పెంచేసారు. యానిమల్ టీజర్ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా అలా పెంచేసింది.. రణ్‌బీర్ కపూర్ ఇందులో హీరో.

06.Bhagavanth kesari

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ‘భగవంత్‌ కేసరి’. ఈ సినిమాలో బాలయ్య కూతురి కేరక్టర్‌లో శ్రీలీల నటించారు. అనీల్‌ రావిపూడి డైరక్ట్ చేశారు. మునుపెన్నడూ చూడని బాలయ్యను ఈ సినిమాలో చూస్తారని అన్నారు అనిల్‌ రావిపూడి. బాలకృష్ణ, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు ఇంకో లెవల్లో ఉంటాయని చెప్పారు.

07. Ram

రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘డబుల్‌ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సంజయ్‌ దత్‌ కీ రోల్‌ చేస్తున్నారు. పూరి కనెక్స్ట్ పతాకంపై తెరకెక్కుతోంది. గురువారం పూరి జగన్నాథ్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్. యాక్షన్‌ లవర్స్ కి సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని చెప్పారు నిర్మాతలు.

08.kantara 2

రిషబ్‌శెట్టి నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతార’. ఈ సినిమాకు ప్రీక్వెల్‌ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘కాంతార 2’లో బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్ అవుతుందని బెంగుళూరు సమాచారం.

09.Vaccine War:

‘కశ్మీర్ ఫైల్స్’ లాగే ‘వ్యాక్సిన్ వార్’ కూడా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసేస్తుందని వివేక్ అగ్నిహోత్రి నమ్మారు. కానీ ఆ దర్శకుడికి షాక్ ఇచ్చారు ఆడియన్స్. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం లేవు. హిందీ సహా పలు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా.. ఇతర భాషల్లో దీనికి అసలు బయ్యర్లు లేరు. తెలుగు వెర్షన్ రిలీజే కాలేదు. హైదరాబాద్, వైజాగ్ లాంటి సిటీల్లో హిందీ వెర్షన్‌కు కొన్ని షోలు ఇచ్చారు. కానీ ఫుల్స్ కాలేదు.

– సతీష్ చంద్ర(ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..