సీబీఎఫ్‌సీలో లంచం.. విశాల్ దెబ్బకు.. దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం..
లంచంగా తన కష్టార్జితాన్ని కాజేశారని.. సీబీఎఫ్సీ తీరును ఎండగడుతూ.. విశాల్ ఓ వీడియో షేర్ చేయడం.. ఆ వీడియో ధాటికి .. వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి రిప్లై రావడం.. సినిమా సీన్నే గుర్తుకు తెస్తుంది ఇప్పుడందరికీ..! సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ.. విశాల్ హీరోనే అనే ట్యాగ్.. నెట్టింట ఇన్‌స్టెంట్‌గా వచ్చేలా కూడా చేస్తోంది.

ఇక అసలు విషయం ఏంటంటే.. విశాల్ హీరోగా.. ఆదిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో.. మార్క్ ఆంటోని సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా హిందీ రిలీజ్ విషయంలో లంచమే పెద్ద అడ్డంకిగా మారిందని హీరో విశాల్ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేయడం అంతటా సంచలనంగా మారింది.
తాజాగా సోషల్ మీడియా వేదికగా.. ఓ వీడియో రిలీజ్ చేసిన హీరో విశాల్.. తన మార్క్ ఆంటోని ఫిల్మ్… హిందీ రిలీజ్ విషయంలో.. ముంబాయ్‌లోని CBFC అఫీషియల్స్ తనను లంచం అడిగిన తీరును ఎండట్టారు. అంతేకాదు తన సినిమా స్ట్రీమింగ్ కోసం 3 లక్షలు.. తన సినిమా సర్టిఫికేషన్ కోసం మూడున్నర లక్షలు లంచం ఇచ్చా అంటూ.. కుండబద్దలు కొట్టినట్టు.. ఆఫీసులో జరుగుతున్న అవినీతిని ఎండగట్టారు. తన కష్టార్జితం కరెప్షన్ పాలవడం.. తన కిష్టం లేదని.. అందుకే.. ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం, పీఎం మోదీ దృష్టికి తీసుకెళ్లాలనే ఈ వీడియో చేశా అన్నారు. ఇక వీడియోకి తోడు.. తను పంపిచిన డబ్బు తాలూకు ట్రాన్‌జాక్షన్ డీటెయిల్స్ కూడా.. తన ట్వీట్లో కోట్ చేశారు విశాల్. అయితే విశాల్ వీడియోపై.. ఆ వీడియోలో ఆయన చేసిన ఆరోపణలపై.. తాజాగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. విశాల్ చేసిన ఆరోపణలపై విచారణ చేసేందుకు ఓ సీనియర్ అధికారిని నియమిస్తున్నట్లు వెల్లడించింది.
– సతీష్ చంద్ర(ఈటీ ప్రొడ్యూసర్)
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..