టైటిల్స్ విషయంలో సీక్రసీ మెయిన్‌టైన్ చేస్తున్న మేకర్స్.. ఎందుకీ సస్పెన్స్‌

Edited By: Phani CH

Updated on: Oct 13, 2025 | 4:19 PM

ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా... ఎంతటీ క్రేజీ డైరెక్టర్‌ కెప్టెన్సీ అయినా... సినిమా మీద ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేది మాత్రం టైటిలే. ఆ టైటిల్‌ను ఫైనల్ చేసే విషయంలో దర్శక నిర్మాతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అందుకే ఆల్రెడీ ఓ పేరు ఫిక్స్ అయినా.. దాని అఫీషియల్‌గా లాక్ చేయటం లేదు. మరో వైపు కొన్ని సినిమాలకు టైటిల్ నిర్ణయించకుండా... వర్కింగ్‌ టైటిల్‌తోనూ రిలీజ్ వరకు లాక్కొస్తున్నారు.

డ్రాగన్‌, ఫౌజీ, రౌడీ జనార్ధన ఈ టైటిల్స్ ఆల్రెడీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఎన్టీఆర్‌ – నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న టాక్‌. ప్రభాస్‌ – హను ప్రాజెక్ట్‌కు ఫౌజీ అనే టైటిల్‌ షూటింగ్ స్టార్ట్ కాకముందు నుంచే వినిపిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీకి రౌడీ జనార్ధన అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు నిర్మాత స్వయంగా చెప్పారు. కానీ ఈ సినిమాల ప్రమోషన్స్‌లో మాత్రం ఆ టైటిల్స్‌ను వాడటం లేదు మేకర్స్.మరో వైపు మహేష్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29, నాగ్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీ కింగ్ 100, వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్‌ ప్రాజెక్ట్‌, పూరీ విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల విషయంలోనూ టైటిల్‌ ఎనౌన్స్ కాలేదు. ప్రజెంట్ వర్కింగ్‌ టైటిల్స్‌తోనే ఈ మూవీస్‌ అప్‌డేట్స్ షేర్ చేస్తున్నాయి యూనిట్స్‌.చిత్ర యూనిట్స్‌ టైటిల్స్ రివీల్ చేయకపోవటం వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉందన్నది మరో వర్షన్‌. ముందు ఓ టైటిల్‌ను జనంలోకి తీసుకెళ్లి అది కనెక్ట్‌ అయితే, దాన్నే అఫీషియల్‌ టైటిల్‌గా ఫిక్స్ చేద్దాం… లేదంటే దాన్ని వర్కింగ్‌ టైటిల్‌ అని పక్కన పెట్టేసి మరో టైటిల్‌ను రివీల్ చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు చాలా మంది మేకర్స్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీ వసూళ్లు సాధిస్తున్న మూవీ.. ఈ నెంబర్స్‌తో ఆ సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతున్నాయా.?

SS Rajamouli: ఇండియా నెం.1 డైరెక్టర్‌గా.. రాజమౌళికి మాత్రమే ఎలా సాధ్యం

Chandrababu Naidu: హైదరాబాద్ ను మించిన రాజధాని నిర్మించాలన్నదే లక్ష్యం

Tirupati: SV వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం

Pedda Amberpet: పెద్ద అంబర్‌పేట్ లో దొంగల బీభత్సం