2027 బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్న యంగ్ హీరోలు

Edited By:

Updated on: Nov 09, 2026 | 5:58 PM

2027ను టార్గెట్‌గా చేసుకుని టాలీవుడ్‌ యువ హీరోలు భారీ సినిమాలతో సిద్ధమవుతున్నారు. సాయిదుర్గ తేజ్‌ ‘సంబరాల ఏటిగట్టు’తో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో కనిపించనుండగా, నిఖిల్‌ ‘స్వయంభు’, ‘ది ఇండియా హౌస్‌’ వంటి పాన్‌ ఇండియా ప్రాజెక్టులతో రానున్నారు. మరోవైపు తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’, ‘జై హనుమాన్‌’ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ముగ్గురి సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోలు మాత్రమే భారీ బడ్జెట్, పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఏళ్ల తరబడి ఆడియన్స్‌ను వెయిట్ చేయించేవారు. కానీ ఇప్పుడు యంగ్ హీరోలు కూడా అదే రూట్‌లో వెళుతున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. భారీ కాన్వాస్, డిఫరెంట్ జానర్లతో తమ మార్కెట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే సాయిదుర్గతేజ్‌, నిఖిల్‌, తేజ సజ్జ లాంటి కుర్ర హీరోలు 2027 బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తూ భారీ సినిమాలతో క్యూ కడుతున్నారు. విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత సాయిదుర్గతేజ్‌ తన కెరీర్‌లోనే మోస్ట్ యాంబిషియస్ ప్రాజెక్ట్ సంబరాల ఏటిగట్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం తేజ్ పూర్తిగా రగ్గడ్ లుక్‌లోకి మారిపోయారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను 2027 స్టార్టింగ్‌లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కార్తికేయ 2తో నేషనల్ లెవెల్‌లో క్రేజ్ తెచ్చుకున్న నిఖిల్ సిద్ధార్థ్.. ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా పీరియాడిక్ సినిమాల మీదే ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం స్వయంభు సినిమాతో పాటు రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ మూవీలో నటిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాలు రెండూ 2027లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. హనుమాన్, మిరాయ్ లాంటి విజువల్ వండర్స్‌తో పాన్ ఇండియా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న తేజ సజ్జ.. 2027 టార్గెట్‌గా ఇంట్రస్టింగ్ సినిమాలు సిద్ధం చేస్తున్నారు. సూపర్ హీరో, ఫాంటసీ జానర్లలో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్న తేజ.. జాంబీ రెడ్డి 2, జై హనుమాన్‌ సినిమాలతో మరోసారి తన మార్కెట్‌ స్టామినాను ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.40 కోట్లు ఇస్తేనే ఉంటాం.. స్టార్ ప్లేయర్ల భారీ డిమాండ్

కాశీలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి పబ్లిక్‌ రోప్‌వే సిద్ధం

ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్

విమానయాన రంగంలో కొత్త శకం.. 90 ఏళ్ల నాటి చట్టం రద్దు

రాపిడో డ్రైవర్‌తో ప్రేమలో పడిన యువతి.. వైరల్ లవ్ స్టోరీ!

Loading...
Unable to load recommendations.
Follow Us