Watch Video: ప్రజల మనసుల్లో గద్దర్ ఎప్పుడూ బతికే ఉంటారు.. నటుడు అలీ భావోద్వేగం

Updated on: Aug 07, 2023 | 1:53 PM

Tollywood Actor Ali on Gaddar: గద్దర్‌తో తనకు 30 ఏళ్లుగా పరిచయం ఉన్నట్లు నటుడు అలీ చెప్పారు. తాను ఆయన్ను ఎప్పుడు కలిసినా నవ్వుతూ మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు. ప్రజల కోసం పోరాడిన వ్యక్తి ఇక లేరని తెలిసి తనకు బాధ కలిగిందన్నారు.

ప్రజా గాయకుడు గద్దర్ పార్ధివ దేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని  ఎల్బీ స్టేడియంలో గద్దర్‌కు ఘన నివాళులర్పించారు ప్రముఖ హాస్య నటుడు అలీ. గద్దర్ భౌతికకాయాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా గద్దర్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురైయ్యారు. గద్దర్‌తో తనకు 30 ఏళ్లుగా పరిచయం ఉన్నట్లు చెప్పారు. తాను ఆయన్ను ఎప్పుడు కలిసినా నవ్వుతూ మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు.

గద్దర్ ఎప్పుడూ ప్రజల కోసం శ్రమించే వ్యక్తి అంటూ కొనియాడారు. ప్రజల కోసం పోరాడిన వ్యక్తి ఇక లేరని తెలిసి తనకు బాధ కలిగిందన్నారు. పిట్టల దొర సినిమా రిలీజ్ నాడు గద్దర్ స్వయంగా తన ఇంటికి వచ్చి.. సినిమా హిట్ సాధిస్తుందని చెప్పారన్నారు. తెలంగాణ కళాకారులకు అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలిపారని అన్నారు.  గద్దర్ భౌతికంగా దూరమైనా ప్రజల మనసుల్లో ఎప్పుడూ బతికే ఉంటారని అన్నారు.