TOP9 ET: సలార్ ట్రైలర్ టీజ్.. మెంటల్ మాస్ అంతే! | చిరు Vs మన్సూర్.! నోరుపారేసుకుంటున్న విలన్.
యానిమల్ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్ అభిమానులకు షాక్ ఇస్తోంది. దాదాపు 3 గంటల 21 నిమిషాల నిడివితో థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా డిజిటల్‌లో మరింత లాంగ్ రన్ టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 3 గంటల 50 నిమిషాల డ్యూరేషన్‌తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఫైనల్ కట్‌ను సిద్ధం చేశారు.| బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి.
01.Prabhas
ఎన్నికల వేడి కూడా చల్లారిపోయేలా.. సలార్ మేనియా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ఎక్కవవుతోంది. సలార్ ట్రైలర్ కోసం ఓ రేంజ్‌లో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తోంది. దానికితోడు.. మేకర్స్ నుంచి జస్ట్ 3 అంటూ ఓ వీడియో టీజ్ రిలీజ్ అయి.. అందర్లో మెంటల్ మాస్ లేచేలా చేసింది. ఎక్కడ విన్నా సలార్ మాటే వినిపిస్తోంది.
02.Chiranjeevi
నిన్న మొన్నటి వరకు త్రిష వర్సెస్ మన్సూర్ అలీఖాన్ గా సాగిన వివాదం.. ఇప్పుడు చిరు వర్సెస్ మన్సూర్ అలీఖాన్ గా టర్న్ తీసుకుంది. నిన్న కాక మొన్నే చిరు పై పరువు నష్టం దావా వేస్తాఅన్న మన్సూర్ తాజాగా తమిళ మీడియాతో ఎక్స్‌టెండెడ్ కామెంట్స్ చేశాడు. చిరు పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీంతో చిరు ఫ్యాన్స్ మన్సూర్ పై సీరియస్ అవుతున్నారు, నెట్టింట ఈ విలన్‌ను… అతడి తీరును ఏకిపారేస్తున్నారు.
03.Animal
యానిమల్ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్ అభిమానులకు షాక్ ఇస్తోంది. దాదాపు 3 గంటల 21 నిమిషాల నిడివితో థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా డిజిటల్‌లో మరింత లాంగ్ రన్ టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 3 గంటల 50 నిమిషాల డ్యూరేషన్‌తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఫైనల్ కట్‌ను సిద్ధం చేశారు.
04.Bagavanth Kesari
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. థియేట్రికల్ రిలీజ్‌లో సూపర్ హిట్ అయిన భగవంత్ కేసరి ఇటీవల డిజటల్‌లో రిలీజ్ అయి అక్కడ కూడా రికార్డ్‌లు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి డైరెక్టర్‌కి కాస్ట్‌లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు.
05.Bunny
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి వర్క్ చేసే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. నేషనల్ అవార్డు వేడుకలో తొలి సారి బన్నీని కలిసా అన్న కృతి, ఆయనకు పెద్ద ఫ్యాన్‌ని అని చెప్పారు. ఇద్దరం కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాం అని, మా కాంబోని దర్శకులు త్వరలో సెట్ చేస్తారని ఆశిస్తున్నా అని చెప్పారు.
06.The Girl Friend
రష్మిక మందన్న లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్‌ప్రెండ్ ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గీతా ఆర్ట్స్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
07.Gangs Of Godavari
విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ముందు ఈ సినిమాను డిసెంబర్ 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూట్‌లో ఆలస్యం కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడింది. 2023 నుంచి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తప్పుకుంది. 2024, మార్చ్ 8న విడుదల కానుంది ఈ చిత్రం. అదే రోజు రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ కూడా విడుదల కానుంది.
08.Hi Nanna
నాని హీరోగా శౌర్యు తెరకెక్కిస్తున్న సినిమా హాయ్ నాన్న. డిసెంబర్ 7న విడుదల కానుంది ఈ చిత్రం. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేసారు. శృతి హాసన్ ఇందులో మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈమెకు సంబంధించిన వీడియోనే విడుదల చేసారు మేకర్స్.
09.Vishal 34
ఈ మధ్యే మార్క్ ఆంటోనీ సినిమాతో 100 కోట్ల విజయాన్ని అందుకున్నారు విశాల్. ఈ ఊపులో వరస సినిమాలకు కమిట్ అవుతున్నారు ఈ యాక్షన్ హీరో. తాజాగా ఈయన తర్వాతి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. విశాల్ కెరీర్‌లో 34వ సినిమా ఇది. మాస్ డైరెక్టర్ హరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్లస్ టీజర్‌ను డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.