TOP9 ET: మమ్మల్ని క్షమించండి..! దిమ్మతిరిగే అప్డేట్.. సలార్ టీజర్‌ ఆ రోజే..

TOP9 ET: మమ్మల్ని క్షమించండి..! దిమ్మతిరిగే అప్డేట్.. సలార్ టీజర్‌ ఆ రోజే..

Anil kumar poka

|

Updated on: Jun 22, 2023 | 9:04 AM

ఓజి సినిమాపై నటి శ్రీయా రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయిప్పుడు. ఈ సినిమా ఆఫర్ వచ్చినపుడు.. రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ ఏమో విని నో చెప్పేద్దాం అనుకున్నానని.. కానీ సుజీత్ చెప్పిన 5 నిమిషాల్లో ఒకే చెప్పేశానని చెప్పారు శ్రీయ. అలాగే మొదట తన కథ, తన రోల్ బాగా ఎగ్జైట్ చేయగా..

01.og
ఓజి సినిమాపై నటి శ్రీయా రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయిప్పుడు. ఈ సినిమా ఆఫర్ వచ్చినపుడు.. రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ ఏమో విని నో చెప్పేద్దాం అనుకున్నానని.. కానీ సుజీత్ చెప్పిన 5 నిమిషాల్లో ఒకే చెప్పేశానని చెప్పారు శ్రీయ. అలాగే మొదట తన కథ, తన రోల్ బాగా ఎగ్జైట్ చేయగా.. ఆ తర్వాత ఈ సినిమా కళ్యాణ్ కోసం ఓకే చేసేశానని ఆమె తెలిపారు. సలార్ అయ్యేంత వరకు మరో సినిమా సైన్ చేయకూడదని తాను తీసుకున్న నిర్ణయం ఓజి కంటెంట్ విన్న తర్వాత మారిపోయిందని తెలిపారు శ్రీయా రెడ్డి. ఈ కామెంట్స్ ఓజిపై అంచనాలు పెంచేస్తున్నాయి.

02. Salar
ఆదిపురుష్ సినిమా ఫినిష్ అవడంతో.. తన నెక్ట్‌ పాన్ ఇండియన్ ఫిల్మ్ సలార్‌ పై ఫుల్ ఫోకస్ పెట్టారు ప్రభాస్. ఇప్పటికే ఫినిష్ అయిన తన షూటింగ్‌కు తోడు.. తన రిమైనింగ్ షూట్‌ను త్వరగా ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. ప్రభాస్‌ మోస్ట్ అవేటెడ్ సలార్ టీజర్‌ … జూలై 7th న రిలీజ్ కానుంది. అకార్డింగ్ టూ ఫిల్మ్ రిపోర్ట్ ఈ మూవీ టీజర్‌ పై ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వర్క్‌ కూడా చేస్తున్నారట.

03. Salaar
ఇక సలార్ సినిమా నుంచి మరో దిమ్మతిరిగే న్యూస్ ఒకటి బయటికి వచ్చిది. ఈ మూవీ కోసం కోసం సరికొత్త కెమెరాను యూజ్ చేస్తున్నట్లు సినిమాటోగ్రఫర్ భువన్ గౌడ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలెక్స్ ఎరీ కెమెరా నెక్ట్స్ వర్షన్‌ను సలార్ కోసం వాడుతున్నామని.. ఐమాక్స్ వర్షన్‌లో 4kలో ఈ సినిమాను చూసి.. అందరూ క్రేజీగా ఫీలవుతారని.. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు కిక్కిస్తున్నాయి.

04. Adipurush
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ … ఇండియన్ సినిమాస్ ముందు తన మేనియాను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దిమ్మతిరిగే వసూళ్లను రాబడుతూనే ఉన్నారు. మిక్స్‌డ్‌ టాక్లోనూ.. వందల కోట్లను కొల్లగొడుతూ.. నయా రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా 5 రోజులకు గాను.. వరల్డ్ వైడర్ 395 క్రోర్‌ గ్రాస్‌ ను వచ్చేలా చేసుకున్నారు ప్రభాస్. టాక్ తో సంబంధం లేకుండా.. వీక్‌ డేస్లో కూడా.. ఈ రేంజ్‌ గ్రాస్‌ సాధించి అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు.

05.dhanush
ధనుష్‌ హీరోగా ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఆల్రెడీ వీరిద్దరిదీ సూపర్‌హిట్‌ కాంబినేషన్‌. వీరి కాంబోలో వచ్చిన రాంజానా, అత్రంగిరే సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్లు కొల్లగొట్టినవే. ఈ సారి యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో లవ్‌ స్టోరీ ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్‌.

06.leo
లియో సినిమా ఫస్ట్ సింగిల్‌ నా రెడీ ప్రోమో వీడియో రిలీజైంది. దళపతి విజయ్‌కి అడ్వాన్స్ విషెస్‌ చెబుతూ ప్రోమో రిలీజ్‌ చేశారు డైరక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌. ఇక ఈ పాటను విజయ్‌ పాడగా… అనిరుద్‌ కంపోజ్‌ చేశారు. ఇప్పటికే కోలీవుడ్ లో మోస్ట్ అవేడెట్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ అక్టోబర్‌ 19న రిలీజ్ కానుంది.

07.Mahesh Guntur karam
త్రివిక్రమ్ డైరెక్షన్లో.. మహేష్ చేస్తున్న క్రేజీ మూవీ గుంటూరు కారం. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి స్టార్ హీరోయిన్‌ పూజా హెగ్డే తప్పుకుందనే ఓ టాక్ అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఇక దాంతో పాటే… పూజా ప్లేస్‌లో.. విరూపాక్ష ఫేం సంయుక్తా మీనన్ నటిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీ నుంచి బలంగా వినిపిస్తోంది. అయితే అఫీషియల్ గా మాత్రం.. ఈ న్యూస్‌ పై నో క్లారిటీ.

09.Adipurush Hanuma
అంజనీ పుత్రుడు.. ఆ ఆంజనేయుడు అసుల దేవుడే కాదంటూ.. షాకింగ్‌ కామెంట్స్ చేసి.. నెట్టింట తీవ్రంగా విమర్శల పాలవుతున్నారు ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్‌ ముంతాషిర్. ఓ నేషనల్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

09.Adipurush Team Sorry
నేపాల్ ప్రజలకు.. ఆ దేశ రాజధాని కాఠ్‌మాండు మేయర్‌కు క్షమాపణలు చెబుతూ ఓ లేఖ రాశారు ఆదిపురుష్ మేకర్స్. ఆ దేశ ప్రజల నమ్మకానికి అతీతంగా… ఆదిపురుష్ సినిమాలో.. సీతను ఇండియాలో పుట్టినట్టు చూపించడం పై అక్కడి ప్రభుత్వ అధికాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సీన్లను సినిమా నుంచి వెంటనే తొలిగించాలని సూచించారు. కానీ.. ఆదిపురుష్ టీం నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో.. తాజాగా ఆదిపురుష్ తో పాటు..బాలీవుడ్ సినిమాలను కూడా బ్యాన్ చేస్తున్నట్టు.. కాఠ్‌ మాండ్ మేయర్ ట్వీట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఆదిపురుష్ మేకర్స్.. ఆ దేశ ప్రజలకు.. మేయర్‌కు క్షమాపణలు చెబుతూ.. ఓ లేఖ విడుదల చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!