TOP9 ET: ఎన్టీఆర్ దూరంగానే.. | పవర్‌ స్టార్.. దిమ్మతిరిగే ఫీట్..! టాప్ ట్రేండింగ్ ఎంటర్టైన్మెంట్ న్యూస్..

|

May 21, 2023 | 9:22 AM

అందర్నీ కట్టిపడేసే యాక్టింగ్‌తో.. ఉవ్వెత్తు ఎగిసిపడుతున్న అలల్లా... తన నోటి వెంట వచ్చే డైలాగ్స్‌తో.. స్టిల్ కెమెరాకు కూడా అందరి.. తన ఫాస్ట్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో.. యంగ్ టైగర్‌ అనే స్క్రీన్ నేమ్‌తో.. కోట్లలో సంపాదించుకున్న ఫ్యాన్స్ బేస్‌తో.. ఎట్ ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయిన అవర్ వెరీ వోన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ... హ్యా పీ బర్త్‌డే ఫ్రమ్‌ టీవీ9 డిజిటల్.

01.NTR
అందర్నీ కట్టిపడేసే యాక్టింగ్‌తో.. ఉవ్వెత్తు ఎగిసిపడుతున్న అలల్లా… తన నోటి వెంట వచ్చే డైలాగ్స్‌తో.. స్టిల్ కెమెరాకు కూడా అందరి.. తన ఫాస్ట్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో.. యంగ్ టైగర్‌ అనే స్క్రీన్ నేమ్‌తో.. కోట్లలో సంపాదించుకున్న ఫ్యాన్స్ బేస్‌తో.. ఎట్ ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయిన అవర్ వెరీ వోన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి … హ్యా పీ బర్త్‌డే ఫ్రమ్‌ టీవీ9 డిజిటల్.

02.Wishesh
ఇక యంగ్ టైగర్ బర్త్‌ డే సందర్భంగా.. ఆయన నియర్ అండ్ డియర్స్‌ సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. మెగాస్టార్, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ మొదలుకుని.. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ కూడా.. తారక్‌ కు వారి వారి స్టైల్లో బర్త్‌ డే విషెస్ చెప్పారు. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు.

03. NTR DEVARA
ఇక దేవర వచ్చేశాడు..! ఉవ్వుత్తున్న ఎగిసిపడుతున్న రాకాసి అలల మధ్యలో..! తన కోసం కాపుకాసిన ముష్కరులను చీల్చుకుంటూ..! కత్తులను.. బళ్లాలను.. వారి శరీరాల్లో దించుకుంటూ..! కత్తికో కండగా.. వారి దేహాలను నరుక్కుంటూ..! ప్రశాతంగా ఉన్న కడలిలో నెత్తురు లావాను పారిస్తున్నాడు. రాజ్యాన్ని ఏలే రాజులా..! అడవిని ఏలే మృగరాజులా..! తన కోసం నిరీక్షిస్తున్న ప్రజలకు దేవరగా.. అడుగులో అడుగేసి మరీ వస్తున్నాడు. కొత్త అధ్యాయాన్ని మొదలెట్టబోతున్నాడు. ఇక రికార్డుల పరంపరను రిపీట్ చేయనున్నాడు.

04. NTR Prashanthneel
దేవర మాత్రమే కాదు.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. యంగ్ టైగర్ చేయబోయే సినిమా నుంచి కూడా.. తారక్ బర్త్‌డే సందర్భంగా అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్తో ద మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ.. మార్చ్‌ 2024 నుంచి షూటింగ్ మొదలుకానుందనే న్యూస్ అఫిషియల్గా బయటికి వచ్చింది.

05.Prabhas
పాన్ ఇండియన్ నెంబర్ 1 హీరోగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ప్రభాస్ ఎట్ ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక నిన్న మొన్నటి వరకు ప్రాజెక్ట్ కే, సలార్‌ షూటింగ్స్‌ చేసిన డార్లింగ్ ఇప్పుడు ఈ రెండు సినిమాల షెడ్యూల్స్‌కు బ్రేక్‌ రావటంతో మారుతి మూవీ టీమ్‌తో జాయిన్ అయ్యారు. ఆ సినిమాకు డేట్స్‌ కేటాయించి షూటింగ్ ఫినిష్‌ చేసే పనిని మొదలెట్టారు.

06.Akhil
అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ సినిమా డిజిటిల్ ఆడియన్స్‌కు షాక్ ఇచ్చింది. ఈ సినిమా మే 19న ఓటీటీలో రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఎలాంటి క్లారిటీ లేకుండానే రిలీజ్ డేట్‌ వాయిదా వేశారు. అఫీషియల్‌గా కన్పార్మ్ చేయకపోయినా మే 26న ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ ముందుకు రానుందన్న ప్రచారం జరుగుతోంది. అఖిల్‌ స్పై రోల్‌లో నటించిన ఏజెంట్‌ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు.

07. Venkatesh
విక్టరీ వెంకటేష్‌ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సైంధవ్‌. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా నవాజ్‌ లుక్‌ను రివీల్ చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది సైంధవ్ టీమ్‌. ఇప్పుడా లుక్ అందర్నీ ఆకట్టుకుంటూనే సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

08. SR. NTR
ఇవాల హైదరాబాద్‌ కూకట్‌ పల్లిలో జరిగే పెద ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. తన బర్త్‌ డే సందర్భంగా తన నియర్ అండ్ డియర్స్‌ తో అప్పటికే షెడ్యూల్ ప్లాన్ చేసుకోకపోవడంతో.. ఈ మహా కార్యక్రమానికి రాలేకపోతున్నా అంటూ తాజాగా తన టీంతో కన్వే చేయించారు ఎన్టీఆర్.

09.Pawan Kalyan
మండు టెండల.. సాక్షిగా.. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నారు పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్‌. రీసెంట్గా… డేస్‌ గ్యాబ్‌తో.. రిలీజ్ అయిన తన రెండు సినిమాల వీడియో గ్లింప్స్‌తో.. బ్రో సినిమా మోషన్ పోస్టర్‌తో.. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను యూట్యూబ్‌లో వచ్చేలా చేసుకున్నారు. ఓవర్‌ ఆల్‌గా.. 33.3 మిలియన్ వ్యూస్‌తో.. అటు రేర్ ఫీట్ ను ఇటు రికార్డ్‌ ఫీట్‌ ను సాధించేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.