TOP 9 ET: 236 కోట్ల తర్వాత.. భోళా సూపర్ డూపర్ ప్లాన్ | పొలిటికల్ వార్‌లోకి ఉస్తాద్ ఎంట్రీ..
బ్రో తర్వాత పొలిటికల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతోందట ఉస్తాద్ మూవీ. ఎస్ ! అకార్డింగ్ టూ ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్... వైసీపీ నాయకులపై..! అందులోనూ.. అంబటి లాగా.. సోషల్ మీడియాలో దొరికిపోయిన.. మంత్రులపై..! వారి క్యారకలాపాలపై... ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో .... మంచి మంచి పంచ్ సీన్లను .. సెటైరికల్ సీన్లను.. ప్లాన్ చేశారట హరీష్ శంకర్. ప్లాన్ చేయడమే కాదు.. తన పెన్నుకు పని చెప్పి మరీ.. వైరల్ అయ్యే డైలాగులను రాసుకుంటున్నారట.
01.Chiranjeevi Bhola
రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ కొట్టిన మెగాస్టార్ చిరు.. ఆసినిమాతో ఏకంగా 236కోట్లు కమాయించేశారు. కానీ తన లేటెస్ట్ బిజినెస్ భోళా శంకర్ విషయంలో మాత్రం సూపర్ డూపర్ ప్లాన్ తో అడుగులు వేస్తున్నారు. సేఫ్ సైడ్‌గా బిజినెస్ చేస్తూ.. డిస్ట్రిబ్యూటర్లు .. బయర్లు నష్టపోకుండా… రైట్స్ రేట్‌ను కోట్ చేస్తున్నారు. అలా మరోసారి తన మంచి మనసుతో మెగా స్టార్ అనిపించుకుంటున్నారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. చిరు భోళా శంకర్ మూవీ.. దాదాపు 22.50 కోట్లకు నైజాం రైట్స్ అమ్ముడుపోయాయని ఇన్‌సైడ్ టాక్.
02.Bola
ఇక భోళా శంకర్ మూవీని మరింతగా ప్రమోట్ చేసేందుకు.. జనాల్లోకి తీసుకెళ్లేందుకు తాజాగా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. ఆగస్టు 5 ఆదివారం శిల్ప కళావేదికలో ఈవెంట్ జరగనుంది. టీవీ9 ఎక్లూజివ్‌గా లైవ్ టెలికాస్ట్ చేయనుంది.
03.Pawan Ustad Hareesh
బ్రో తర్వాత పొలిటికల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతోందట ఉస్తాద్ మూవీ. ఎస్ ! అకార్డింగ్ టూ ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్… వైసీపీ నాయకులపై..! అందులోనూ.. అంబటి లాగా.. సోషల్ మీడియాలో దొరికిపోయిన.. మంత్రులపై..! వారి క్యారకలాపాలపై… ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో …. మంచి మంచి పంచ్ సీన్లను .. సెటైరికల్ సీన్లను.. ప్లాన్ చేశారట హరీష్ శంకర్. ప్లాన్ చేయడమే కాదు.. తన పెన్నుకు పని చెప్పి మరీ.. వైరల్ అయ్యే డైలాగులను రాసుకుంటున్నారట. పవన్ పొలిటికల్ కార్యక్రమాలను.. ఆ కార్యక్రమాలపై కొంత మంది నేతలు చేస్తున్న విమర్శలను ఫాలో అవుతూనే .. సినిమాకు తగ్గట్టు.. పవన్ రియాక్షన్ ఇదే అన్నట్టు.. కొన్ని సీన్లను కూడా.. సినిమాలో చొప్పిస్తున్నారట.
04. Samantha
మయోసైటిస్‌లో వేలాది మంది బాధపడుతూ ఉంటారని అన్నారు సమంత. ట్రీట్‌మెంట్ కోసం పాతిక కోట్లు ఖర్చు కావని చెప్పారు. తాను అందులో చాలా తక్కువ మొత్తాన్ని ఖర్చుపెడుతున్నట్టు తెలిపారు. ఆమె ట్రీట్‌మెంట్ కోసం ఓ హీరో దగ్గర పాతిక కోట్లు తీసుకున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. దాని మీద పరోక్షంగా స్పందించారు సమంత. తన బాగోగులు తాను చూసుకోగలనని అన్నారు.
05.Kushi
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న సినిమా ఖుషీ. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ సెన్సార్ పూర్తైంది. ఇదే విషయాన్ని ట్వీట్ చేసారు విజయ్. ఆగస్ట్ 9న ట్రైలర్ విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. కాగా ట్రైలర్ 2.41 నిమిషాలు ఉండబోతుంది. సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు శివ నిర్వాణ.
06.Bhola shankar
మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’లో నటించడంతో తన కల నెరవేరిందని అన్నారు తమన్నా. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ‘జైలర్’లో నటించడం బోనస్‌గా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల్లో బ్యాక్ టు బ్యాక్ రెండు రిలీజులున్నాయి తమన్నాకు. ‘జైలర్’లో ‘కావాలయ్యా…’ పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో, ‘భోళాశంకర్’లో ‘మిల్కీ బేబీ…’ పాట కూడా అంతే క్లిక్ అవుతుందని చెప్పారు.
07.kiara
‘గేమ్ చేంజర్ తన లైఫ్‌లో స్పెషల్ మూవీ అని అంటున్నారు కియారా అద్వానీ. ఈ ఇయర్‌లోనే షూటింగ్ పూర్తి చేయడానికి ప్లానింగ్ జరుగుతోందన్నారు. రామ్‌చరణ్ తనకు మంచి స్నేహితుడని, శంకర్ నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు కియారా. ఫ్యాన్స్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేసినా, అంతకు మించి ఉంటుందని చెప్పారు.
08.Mrunal
‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ లో ‘డైవర్సిటీ ఇన్ సినిమా’ అవార్డు అందుకోనున్నారు నటి మృణాల్ ఠాకూర్. ఈ నెల 11న ఈ వేడుక జరగనుంది. భాషలకు, సంస్కృతులకు అతీతంగా సినిమాలు జనాల మనసులను టచ్ చేస్తాయని మరోసారి అర్థమైందని అన్నారు మృణాల్. సరిహద్దులు దాటి నటించాలన్న కొత్త కోరిక కలుగుతోందని చెప్పారు.
09.sharukh
షారుక్ వయసు గురించి ఆనంద్ మహీంద్ర పెట్టిన పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. షారుఖ్ వయసు 57 ఏళ్లంటే నమ్మబుద్ధి కావడం లేదని అన్నారు. ఈ ట్వీట్‌కి షారుఖ్ కూడా స్పందించారు. జీవితం చాలా చిన్నదని, ఉన్నంతలో నలుగురికీ సంతోషాన్ని పంచుతూ, ఆనందంగా గడపాలని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...