TOP 9 ET: TV9 ఆఫీసులో ఐకాన్ స్టార్ స్టైల్లో తగ్గేదేలే.. | మహేష్ సాయంతోనే నేషనల్ అవార్డు వరకు..?

|

Aug 27, 2023 | 10:00 AM

కల్ట్ బ్లాక్ బస్టర్‌ 7/జీ బృందావన్‌ కాలనీ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. తొలి భాగంలో హీరోగా నటించిన రవికృష్ణ సీక్వెల్‌లోనూ లీడ్ రోల్‌ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మలయాళ నటి అనస్వర రాజన్ నటిస్తున్నారు. ఈ బ్యూటీ తమిళ, హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సీక్వెల్‌, సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

01.Allu arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆహాలో సందడి చేశారు. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన వేళ.. ఆహా టీం ఇన్విటేషన్‌ మేరకు.. ఆహా ఆఫీసుకు విచ్చేశారు. కేక్ కట్ చేశారు. దాంతో పాటే.. తనను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేశారు ఐకాన్ స్టార్. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

02.samantha
మంచి అయినా, చెడు అయినా దాన్ని అంగీకరించగల మనస్తత్వాన్ని అనుభవం నేర్పుతుందని చెప్పారు నటి సమంత. ఈ విషయంలో ఎలాంటి పుస్తకాలు, గైడ్స్ ఉండవని చెప్పారు. ఖుషి సినిమా ప్రచారంలో భాగంగా ఆమె కోలీవుడ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది ఖుషి మూవీ. విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ఇది.

03.Devara ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ వైరల్ అవుతోంది. మత్యకారుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ డీ గ్లామరస్‌ లుక్‌లో కనిపించబోతున్నారట. అంతేకాదు ఈ సినిమాలో జాన్వీ యాక్షన్‌ సీన్‌ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సీన్‌ షూటింగ్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది.

04.skanda
రామ్‌ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన సినిమా స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హీరో నందమూరి బాలకృష్ణ విచ్చేశారు. ఈ సినిమా టీంకు తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 15న వరల్డ్ వైడర్ రిలీజ్‌కు రెడీ అవనుంది.

05. Rocketry
మాధవన్‌ నటించిన సినిమా రాకెట్రీకి జాతీయ పురస్కారం దక్కింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలిపారు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. ఇక ఆయన ట్వీట్‌ని కోట్‌ చేస్తూ, సినిమా విడుదల సమయంలో చేసిన సాయానికి థాంక్స్ అంటూ చెప్పారు మాధవన్‌. దీంతో మహేష్ ఏ సాయం చేసి ఉంటారని.. మహేష్ ప్యాన్స్ అండ్ నెటిజెన్స్ కొంత మంది నెట్టింట ఆరా తీయడం మొదలెట్టారు.

06. Jailer
జైలర్‌ సినిమా 525 కోట్లకు పైగా వసూలు చేసి, థియేటర్లలో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌తో కలిసి కేక్‌ కట్‌ చేశారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. తమిళనాడులో హయ్యస్ట్ గ్రాసర్‌గా సెకండ్‌ ప్లేస్‌లోకి వచ్చింది జైలర్‌. ఫస్ట్ ప్లేస్‌లో రజనీకాంత్‌ నటించిన 2.0 ఉంది.

07. khushi
విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది. ఈ సినిమాలోని ఓసి పెళ్లామా ఫిఫ్త్ సింగిల్‌ తాజాగా విడుదలైంది. విడుదలవ్వడమే కాదు.. సరదాగా సాగుతూ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ డూపర్ హిట్టైపోయాయి. సినిమా పై అమాంతంగా అంచనాలను కూడా పెంచేశాయి.

08. karthikeya
తనకు గోదావరి జిల్లాల్లో షూటింగ్‌ చేయడం చాలా ఇష్టమని అంటున్నారు కార్తికేయ. ఆర్‌ ఎక్స్ 100, బెదురులంక 2012 సినిమాలను అక్కడే షూట్‌ చేశామని చెప్పారు. ఆర్.ఎక్స్ .100కి సీక్వెల్‌ ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని డైరక్టరే చెప్పాలని అన్నారు. మంచి విలన్‌ రోల్స్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

09. 7G
కల్ట్ బ్లాక్ బస్టర్‌ 7/జీ బృందావన్‌ కాలనీ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. తొలి భాగంలో హీరోగా నటించిన రవికృష్ణ సీక్వెల్‌లోనూ లీడ్ రోల్‌ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మలయాళ నటి అనస్వర రాజన్ నటిస్తున్నారు. ఈ బ్యూటీ తమిళ, హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సీక్వెల్‌, సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...