TOP 9 ET: తాళి కట్టిన శుభవేళ..వరుణ్ లవ్. | ఇక మొదలెడదామా.. సలార్ వేట షురూ..

TOP 9 ET: తాళి కట్టిన శుభవేళ..వరుణ్ లవ్. | ఇక మొదలెడదామా.. సలార్ వేట షురూ..

Anil kumar poka

|

Updated on: Nov 02, 2023 | 8:17 AM

బాలకృష్ణ దసరా సినిమా భగవంత్ కేసరి ఓటిటి రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చింది. నవంబర్ 23 నుంచి ప్రముఖ ఓటీపీ అమెజాన్ ప్రైమ్‌ ఈ సినిమాను స్ట్రీమ్ చేయనున్నట్టు.. ఇండస్ట్రీలో అన్ అఫీషియల్.. పక్కా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఓటీటీలో బాలయ్య రోరింగ్ చేయడం ఖాయం అనే కామెంట్ కూడా.. బాలయ్య ఫ్యాన్స్ నుంచి నెట్టింట వస్తోంది. | ఒక్కో అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది దేవర టీమ్. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుందని ఇటీవల ఎనౌన్స్‌ చేసిన మేకర్స్‌.

01.Varun Tej
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఇండియన్ టైమింగ్ ప్రకారం నవంబర్ 1 మధ్యాహ్నం రెండు గంటల 48 నిమిషాలకు వరుడు వరుణ్.. వధువు మెడలో తాళి కట్టాడు. చుట్టూ ఉన్న తన నియర్ అంట్ డియర్స్‌ మధ్య లావణ్యను తన ఆళిగా చేసుకున్నాడు. ఇక ఆ ఫోటోలతో నెట్టింట వైరల్ అవుతున్నారు ఈజోడీ.

02.Salar
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ సలార్. డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ తాజాగా మొదలుకానున్నాయట. అందుకోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడట. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు రెబల్‌ ఫ్యాన్స్ గుండెల్లో.. రీసౌండ్ చేస్తోంది. సోషల్ మీడియాను ఊపేస్తోంది.

03. Bhagavanth Kesari
బాలకృష్ణ దసరా సినిమా భగవంత్ కేసరి ఓటిటి రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చింది. నవంబర్ 23 నుంచి ప్రముఖ ఓటీపీ అమెజాన్ ప్రైమ్‌ ఈ సినిమాను స్ట్రీమ్ చేయనున్నట్టు.. ఇండస్ట్రీలో అన్ అఫీషియల్.. పక్కా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఓటీటీలో బాలయ్య రోరింగ్ చేయడం ఖాయం అనే కామెంట్ కూడా.. బాలయ్య ఫ్యాన్స్ నుంచి నెట్టింట వస్తోంది.

04.Devara
ఒక్కో అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది దేవర టీమ్. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుందని ఇటీవల ఎనౌన్స్‌ చేసిన మేకర్స్‌. తాజాగా హీరోయిన్‌ జాన్వీ కపూర్ లుక్‌ను రివీల్ చేశారు. ఆమె తంగం అనే పాత్రలో నటిస్తున్నట్టుగా వెల్లడించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.

05.Jawan
ఫైనల్‌గా జవాన్‌ డిజిటల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రేపటి నుంచి అంటే నవంబర్ 2 నుంచి… డిజిటల్ ఆడియన్స్‌కు అందుబాటులోకి రానుంది జవాన్‌. ఇక అట్లీ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌లో సూపర్ డూపర్ హిట్టైంది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ హిస్టరీలో బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచింది.

06.Adikesava
డెబ్యూ డైరెక్టర్‌ శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్షన్లో… వైష్ణవ్ తేజ్ హీరోగా.. తెరకెక్కుతున్న ఫిల్మ్ ఆదికేశవ. నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను…. తాజాగా నవంబర్‌ 24 కు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగ్‌ వంశీ.

07. Devil
ఆదికేశవతో పాటే.. కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న డెవిల్ సినిమా కూడా వాయిదా పడింది. నవంబర్ 24న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను… అనుకోని కారణాలతో వాయిదా వేస్తున్నట్టు చెప్పారు ఈ మూవీ మేకర్స్‌. అంతేకాదు త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామంటూ.. క్లారిటీ ఇచ్చారు.

08.Magadheera
రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన మగధీర సినిమా… చాలా యేళ్ల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. గీతా ఆర్ట్స్‌ లో భారీ స్కేల్లో తెరకెక్కిన ఈ సినిమా… నవంబర్ 3 నుంచి ఆహాలో.. స్ట్రీమింగ్ అవనుంది.

09.Rajinikanth
రజనీకాంత్‌, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా విషయంలో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. విక్రమ్ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కమల్‌ హాసన్‌ను నెగెటివ్‌ షేడ్స్‌లో చూపించిన లోకేష్‌, రజనీ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారట. తలైవా 171లో రజనీ నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Nov 02, 2023 07:20 AM