TOP9 ET: ఇండియా సినిమా చరిత్రలోనే కల్కి రికార్డ్ | బన్నీ- సుకుమార్ మధ్య గొడవలు అసలు విషయం ఇది!
తనపై లావణ్య పెట్టిన కేసులో.. విచారణకు హాజరు కావాలంటూ.. నార్సింగ్ పోలీసులు పంపిన నోటీసులపై హీరో రాజ్ తరుణ్ రియాక్టయ్యారు. తాను విచారణకు హాజరు కాలేనంటూ..తన లాయర్ ద్వారా పోలీసులకు వివరణ పత్రాలను పంపాడు. ఇక ఆ పత్రాలను పరిశీలించిన పోలీసులు.. మరోసారి రాజ్ తరుణ్‌కు నోటీసులిచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా సమాచారం.
01.kalki: ఇండియా సినిమా చరిత్రలోనే కల్కి ఎవర్‌గ్రీన్ రికార్డ్.!
ఇండియన్ సినిమా చరిత్రలో ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేశారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. కల్కి సినిమా టికెట్ సేల్స్ బుకింగ్స్‌లో బుక్ మై షోలో.. ఓ రేర్ ఫీట్‌ను అచీవ్ చేశాడు. ఇక నాగి డైరెక్షన్లో ప్రభాస్ చేసిన కల్కి మూవీ.. ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫాం బుక్ మై షోలో ఇప్పటి వరకు 12.15ప్లస్ మిలియన్ల టికెట్స్ సేల్స్ జరిగాయని రిపోర్ట్. అయితే ఈ నెంబర్‌ను ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా అందుకోలేదు. దీంతో ప్రభాస్ కల్కి మూవీ.. బుక్ మై షోలో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసినట్టైంది. ఇక ఈ సినిమా తర్వాత 12.01 మిలియన్ టికెట్ సేల్స్‌తో షారుఖ్ జవాన్ ఉంది.
02. ntr: తమిళనాడులో దేవరకు గట్టి ఎదురుదెబ్బ!
ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్… కొరటాల శివ డైరెక్షన్లో దేవరగా వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కోలీవుడ్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేవర రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27నే.. కార్తీ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘మెయియాజగన్’ ను రిలీజ్ చేస్తున్నట్టు ఆ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ బయటికి వచ్చింది. ఈ మూవీతో పాటే జయం రవి బ్రదర్ , కెవిన్ బ్లడీ బెగ్గర్ సినిమాలు కూడా సేమ్ డేట్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. దీంతో దేవరకు కోలీవుడ్‌లో థియేటర్లు దొరకడం కాస్త కష్టమే అనే టాక్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలోనే వస్తోంది.
03.vishnu: ఐకాన్ స్టార్‌కు సూటి పెట్టిన విష్ణు. వాట్ నెక్స్ట్?
పాన్ ఇండియా సెగ్మెంట్లో.. కన్నప్ప సినిమా చేస్తన్నా అంటూ.. అనౌన్స్ చేసిన దగ్గర నుంచి.. ఈ సినిమాపై ఓ రేంజ్‌లో వర్క్ చేస్తున్న విష్ణు.. తాజాగా ఓ బిగ్ హింట్ ఇచ్చారు. తన మోస్ట్ అవేటెడ్ కన్నప్ప మూవీ 2024 డిసెంబర్లో అంటూ.. ఓ ట్వీట్ చేశారు. అయితే ఇదే నెలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 కూడా రిలీజ్ కానుండడంతో.. విష్ణు – బన్నీకి సూటి పెట్టాడా? ఏంటి? అనే కామెంట్ నెట్టింట ఫన్నీగా వస్తోంది. దానికి తోడు ఐకాన్ స్టార్ పుష్ప2.. విష్ణు కన్నప్ప? ఒకే రోజు.. రిలీజ్ అయితే.. వాట్ నెక్స్ట్ అనే కొశ్చన్ మార్క్ కామెంట్ కూడా.. నెటిజన్స్ నుంచి వస్తోంది.
04.pawan kalyan: డిప్యూటీ సీఎంగా కొలువుదీరాక 1st టైం స్టైలిష్ లుక్‌లో పవన్
హీటెడ్‌గా సాగిన ఏపీ ఎలెక్షన్ క్యాంపెయిన్‌లో.. ! ఆఫ్టర్ రిజల్ట్, జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో..! డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత రోజుల్లో.. కుర్తా పైజామాలో… ఆ తరువాత వారాహి దీక్షా వస్త్రాల్లో కనిపించిన పవన్.. చాలా రోజుల తర్వాత స్టైలిష్ లుక్‌లో కనిపించారు. బ్లాక్ షర్ట్.. కాఫీ కలర్ ప్యాంట్‌లో.. స్టన్నింగ్ గా అనిపించారు. తన భార్య అన్నా లెజ్‌నెవాతో కలిసి.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్లాష్ అయ్యారు. ఈ వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు జనసేనాని.
05.sukumar: బన్నీ- సుకుమార్ మధ్య గొడవలు.. అసలు విషయం ఇది!
బన్నీ సుకుమార్ ల మధ్య గొడవలు జరిగాయని.. ఆ కోపంతో పుష్ప2 సెట్స్ నుంచి బన్నీ వాకౌట్ చేసి.. ఫ్యామిలీతో ఫారెన్ టూర్ వెళ్లపోయాడని.. తలా తోక లేని రూమర్స్ గత రెండు రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి… నెట్టింట కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రూమర్స్‌కు తాజాగా అడ్డుకట్ట వేసింది బన్నీ టీం. బన్నీకి సుకుమార్‌కు మధ్య ఎలాంటి గొడవలు లేవని… వాదిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. షూటింగ్‌లో గ్యాప్ దొరకడం.. వారి వ్యక్తిగత పనులను ఫినిష్ చేయాల్సి రావడంతో.. సుకుమార్ యూఎస్, బన్నీ యూరప్‌కు వెళ్లారని చెప్పింది. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో పుష్ప2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందంటూ కన్ఫర్మ్ చేసింది బన్నీ టీం.
06.raj tharun: పోలీస్ విచారణకు రాజ్ తరుణ్ డుమ్మా..
తనపై లావణ్య పెట్టిన కేసులో.. విచారణకు హాజరు కావాలంటూ.. నార్సింగ్ పోలీసులు పంపిన నోటీసులపై హీరో రాజ్ తరుణ్ రియాక్టయ్యారు. తాను విచారణకు హాజరు కాలేనంటూ..తన లాయర్ ద్వారా పోలీసులకు వివరణ పత్రాలను పంపాడు. ఇక ఆ పత్రాలను పరిశీలించిన పోలీసులు.. మరోసారి రాజ్ తరుణ్‌కు నోటీసులిచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా సమాచారం.
07.janvi: ఆసుపత్రిలో చేరిన జాన్వీ కపూర్
ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. అస్వస్థతకు గురయ్యారు. చెన్నై ఎయిర్ పోర్ట్‌లో తిన్న పుడ్ కారణంగా.. తీవ్ర కడుపు నొప్పితో రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. మరో రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ మీడియాతో చెప్పారు. పుడ్ పాయిజన్ కారణంగానే తన కూతురు ఆస్పత్రిలో చేరినట్టు క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే జాన్వీ హాస్పిటల్ లో చేరారన్న న్యూస్‌తో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గెట్ వెల్ సూన్ జాను అంటూ నెట్టింట హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
08.jagapathi: సిగ్గు శరం లేని వాడినని దిగులు పడను..
అందరి ట్వీట్లు ఒకెత్తైతే.. ఆర్జీవీ ట్వీట్లు మరొక ఎత్తు అనే కామెంట్ నెట్టింట ఉండేది నిన్నమొన్నటి వరకు. కానీ ఈ కామెంట్‌ను.. తన ఫన్నీ అండ్ ఫ్రాంక్‌నెస్ ట్వీట్లతో తన వైపు మళ్లించుకున్నారు జగపతి బాబు. రీసెంట్ డేస్లో చిత్ర విచిత్రమైన ట్వీట్లకు కేరాఫ్‌గా మారిన ఈ స్టార్.. ఇప్పుడు కూడా అలాంటి ట్వీట్ ఒకటి చేశారు. తను క్యాసినోలో తీసుకున్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన జగపతి బాబు.. సిగ్గు శరం లేని వాడినని దిగులు పడను..కానీ., మీరు చెబితే పడతాను అంటూ ఆ ఫోటో కు క్యాప్షన్‌గా రాసుకొచ్చారు. తన ట్వీట్‌తో ..ఆ ట్వీట్‌లోని తన రాతతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతన్నారు ఈ స్టార్.
09.vishnu: ట్రోలింగ్ చేస్తే.. ఉగ్రవాదులుగా పరిగణిస్తాం..
నటీనటుల్ని ట్రోల్ చేసేవారిని ఉగ్రవాదులుగా పరిగణిస్తామని హెచ్చరించింది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. యూట్యూబర్లపై డీజీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మా ప్రతినిధులు శివబాలాజీ, రాజీవ్ కనకాల ఇదే విషయాన్ని చెప్పారు. అంతేకాదు ఆన్‌లైన్ ట్రోలింగ్ చేస్తున్న 200 యూట్యూబ్ ఛానళ్లపై కంప్లైంట్ చేశామన్నారు. ఇప్పటికే 25 ఛానెళ్స్ బ్యాన్ చేయించామని.. చెప్పారు. యాక్టర్స్ పై ట్రోల్స్ చేస్తే అస్సలు సహించేది లేదని.. యూట్యూబర్లను హెచ్చరించారు.
10.vurvashi: ఊర్వశి ప్రైవేట్ వీడియో లీక్
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అందులోనూ అందాలు ఆరబోసే హీరోయిన్ల వీడియోలు మాత్రం అందరి అటెన్షన్ ను గెయిన్ చేస్తూ.. నెట్టింట సంచలనంగా మారుతుంటాయి. ఇప్పుడు ఊర్వశి రౌతేలా బాత్రూం వీడియో ఒకటి కూడా… అలా సంచలనమవుతోంది. అయితే ఈ వీడియో నిజంగా లీక్‌డ్ వీడియోనా.. లేక ఏదైనా మూవీ ప్రమోషన్ కోసం.. తనే వదిలిన వీడియోనా అనేది పక్కకు పెడితే.. ఈ వీడియో మాత్రం.. ఇప్పుడు త్రూ అవుట్ సోషల్ మీడియా తెగ తిరుగుతోంది. ఈ అమ్మడి ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.