TOP9 ET: ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వేళ పవన్ మాస్టర్ స్ట్రైక్ | కల్కి వాయిదా?
ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వేళ.. పవన్ మాస్టర్ స్ట్రైక్ వదిలారని అంటున్నారు కొంతమంది నెటిజన్స్. పవన్‌కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉందని.. సినిమాల్లో ఆయనే ఎట్ ప్రజెంట్ కింగ్ అని.. ఆ మేనియాను ఒక్క సారిగా పైకి తీసుకొచ్చేందుకే ఉన్నపళంగా ఆయన సినిమా అప్టేట్స్ వచ్చాయాని వారు నెట్టింట కోట్ చేస్తున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే కొన్ని గంటల ముందు ఓజీ నుంచి పవర్ ఫుల్ పవన్ పోస్టర్ రిలీజ్ కావడం కూడా ఇందుకే అంటున్నారు.
01.pawan: ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వేళ పవన్ మాస్టర్ స్ట్రైక్.
ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వేళ.. పవన్ మాస్టర్ స్ట్రైక్ వదిలారని అంటున్నారు కొంతమంది నెటిజన్స్. పవన్‌కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉందని.. సినిమాల్లో ఆయనే ఎట్ ప్రజెంట్ కింగ్ అని.. ఆ మేనియాను ఒక్క సారిగా పైకి తీసుకొచ్చేందుకే ఉన్నపళంగా ఆయన సినిమా అప్టేట్స్ వచ్చాయాని వారు నెట్టింట కోట్ చేస్తున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే కొన్ని గంటల ముందు ఓజీ నుంచి పవర్ ఫుల్ పవన్ పోస్టర్ రిలీజ్ కావడం కూడా ఇందుకే అంటున్నారు. ఉస్తాద్ సినిమా ఆగిపోలేదు.. త్వరలో అప్డేట్ వస్తుందనే మేకర్స్ ట్వీట్ కూడా పవన్ ఫ్యాన్స్‌లో ఉత్తేజితం నిపండం కోసమే కావచ్చని అనలైస్ చేస్తున్నారు.
02.prabhas: ఏపీ ఎలక్షన్ ఎఫెక్ట్ కల్కి వాయిదా?
అది ప్రభాస్ అయినా.. ఇంకెవరైనా..? రస్తవత్తరంగా ఏపీ రాజకీయాలు సాగుతున్న వేళ..! ఎలక్షన్స్ క్యాపెయిన్లు జరుగుతున్న వేళ.. ! సినిమాలు ఆడుతాయా చెప్పండి ఆడవు కదా..! అందుకే కాబోలు మే9 న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్న కల్కి మూవీ.. రిలీజ్ డేట్ వాయిదా పడుతుందట. మే 13న పోలింగ్ ఉండడం.. అంతకు రెండు వారాల ముందు నుంచి ఏపీ వాసులు మొత్తం రాజకీయ నాయకుల వాగ్దానాలు వింటూ బిజీగా ఉండనుండడంతో… కల్కి రిలీజ్ డేట్ ఎలక్షన్ తర్వాతకు లేదంటే రిజెల్ట్ తర్వాతకు మారుస్తే బెటర్‌గా ఉంటుందని మేకర్స్ థింక్ చేస్తున్నారట.
03.rgv: వెర్రి పప్పల్ని చేశాడుగా.!
అందర్నీ ఎర్రి పప్పల్ని చేయడం ఓ అలవాటుగా పెట్టుకున్న ఆర్జీవీ.. మరో సారి అదే పని చేశారు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా నిలబడతా అంటూ పవన్ అలా చెప్పారో లేదో.. ఇలా తాను కూడా పిఠాపురం నుంచి కంటెస్టెంట్ చేస్తా అంటూ ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు మీరందరూ బకారాలు తాను అలా చెప్పలేదంటూ..తన అతితెలివితో మరో కొత్త వివరణ ఇచ్చారు. పిఠాపురంలో తాను తీసిన కంటెస్ట్ అనే షార్ట్ ఫిల్మ్ గురించి తాను ట్వీట్ చేశానని.. దాన్ని అందరూ తప్పుగా తీసుకున్నారని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. కానీ ఇక్కడ ఫ్యాన్స్ అనుకుంటున్న ఇంకో విషయం ఏంటంటే..! పవన్ ట్వీట్‌లను ఎవరూ తీసుకోరని!
04.ram charan: ఫ్యాన్స్ తాకిడితో.! అల్ల కల్లోలమైన వైజాగ్ బీచ్.
కుప్పలు తెప్పలుగా.. గుంపులు గుంపులుగా జనం ఉంటే.. ఇసుక వేస్తే కింద రాలనంత జనం ఉన్నారని.. చెబుతుంటాం..! కానీ దీనికి బదులు.. ఇప్పటి నుంచి బీచ్‌లో ఉన్న ఇసుక కనిపించనంత! అని చెబుతాం ఏమో! ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను చూసేందుకు వైజాగ్ ఆర్కే బీచ్‌కు ఆ రేంజ్లో జనం వచ్చారు కాబట్టి. ఎస్ ! గేమ్ ఛేంజర్ నయా షెడ్యూల్లో భాగంగా… వైజాగ్ వచ్చిన చెర్రీ అండ్ టీం.. అక్కడ వైజాగ్ బీచ్‌లో వేసిన బహిరంగ సభ సెట్టులో షూటింగ్‌కు వచ్చారు. అయితే ఇది తెలిసిన మెగా ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ బలగం.. కుప్పలు తెప్పలుగా ఆర్కే బీచ్‌కు వచ్చారు. బీచ్‌నే అల్లకల్లోలం చేసేశారు.
05.mrunal vijay: వీళ్ల మధ్య ఏదో జరుగుందబ్బా.. రష్మిక జర జాగ్రత్త!
పెళ్లిల్లు పక్కకు పెడితే.. ప్రేమలు అనేవి సెలబ్రిటీల మధ్యలో కామన్. అయితే ఈ కామన్ విషయంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక మునిగితేలుతున్నారు గత కొంత కాలంగా..! అయితే మృణాల్ తీరు చూస్తుంటే ఈ మునకలో రష్మిక గల్లంతయ్యేలానే ఉన్నారంటున్నారు ఫ్యాన్స్. ఆన్ స్క్రీన్‌నే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా మృణాల్ కాస్త క్లోజ్‌గా విజయ్‌తో ఉండడానికి వారు నోటీస్ చేసి.. నెట్టింట కామెట్ చేస్తున్నారు. రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ పోస్ట్ చేసిన షూటింగ్ వ్రాప్ వీడియోలోనూ… మృణాల్ విజయ్‌ను మరీ గట్టిగా హత్తుకొని.. ఎక్ట్రా కెమెస్ట్రీ కురిపించడాన్ని వాళ్లు గుర్తు పట్టారు. ఇదే చెబుతూ మృణాల్ విషయంలో.. రష్మక జర జాగ్రత్తగా ఉండాలంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు.
06.samantha: బన్నీ అంటే క్రష్.. ప్రభాస్ రెస్పెక్ట్ వైరల్‌గా సామ్ రియాక్షన్
సోషల్ మీడియాలో ఎప్పుడూ కొన్ని వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా సమంతకు సంబంధించిన ఓ త్రో బ్యాక్ వీడియో కూడా వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోలో.. ఈ బ్యూటీ అల్లు అర్జున్ అంటే తనకు క్రష్ అని.. ప్రభాస్ అంటే రెస్పెక్ట్ అంటూ చెప్పింది. ఇప్పుడు ఇదే మాటల కారణంగా… ఈ స్టార్ హీరోస్ ఫ్యాన్ సర్కిల్లో వైరల్ అవుతోంది.
07.sai pallavi: సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా
మొన్నటివరకు కుర్రకారుకి నాచులర్ బ్యూటీ అంటే సాయిపల్లవే. అయితే ఈ బ్యూటీ ప్లేస్‌నే ఒక్క సినిమాతో లాగేసుకుంది ప్రేమలు బ్యూటీ మమిత బైజూ. లాగేసుకోవడమే కాదు.. తన స్మైల్‌తో.. తన సింప్లీ సిటీ అంటే.. డ్రస్సింగ్ స్టైయిల్‌తో.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఆ ఫోటోలతోనే ఇప్పుడు సాయి పల్లవికి చెక్ పెట్టేస్తోంది. నాచురల్ బ్యూటీగా… తన నేమ్ నెట్టింట రిజిస్ట్రర్ర అయ్యేలా కూడా చేసుకుంది.
08.samantha: సారీ! నేను సెక్సీ కాదు.!
అందరు అమ్మాయిల్లా సమంత కూడా ఇంతేనా..! ఇలాగే ఆలోచిస్తారా? అనే డౌట్ వచ్చేలా చేసుకుంటోంది రీసెంట్గా తాను మాట్లాడిన మాటలతో.! ఎట్ ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామన్ అమ్మాయిలా కొన్ని విషయాలు మాట్లాడారు. తాను అందంగా ఉండనని అన్నారు. అందరి అమ్మాయిలలా కూడా అందంగా కనిపించను అన్నారు. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి.. తను సెక్సీ కాదని.. తనకు ఆ పదం సెట్ కాదని కూడా చెప్పి.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు. సమంతే అందంగా లేదంటే.. మన పరిస్థితి ఏంటని అమ్మాయి ఫీలయ్యేలా కూడా చేస్తున్నారు.
09.venkatesh: వెంకీ వారి పెళ్లి సందడి
పెళ్లంటేనే అదో సందడి.! అదే స్టార్ హీరో ఇంట పెళ్లంటే.. అదో వేరే లెవల్ సందడి! అయితే ఆ సందడే విక్టరీ వెంకటేష్ ఇంట వెళ్లివిరిసింది. పెళ్లి కళతో.. రామానాయుడు స్టూడియోస్ వెలిగిపోయింది. తండ్రి బాధ్యత నెరవేర్చే క్రమంలో మన హీరో వెంకటేష్ ముఖం.. తన బిడ్డను పెళ్లి బట్టల్లో చూసి మురిసిపోయింది. ఆ ఫోటోలే ఇప్పుడు నెట్టింట వైరల్ అవడం మొదలైంది. ఇప్పటికే తన మొదటి బిడ్డ అర్షిత పెళ్లిని.. విజయవాడకు చెందిన డాక్టర్ నిషాంత్‌తో చాలా గ్రాండ్‌గా చేసిన విక్టరీ వెంకటేష్.. అంతే గ్రాండ్‌గా తన రెండో బిడ్డ హయవాహిని వివాహం జరిపించారు. రామానాయుడు స్టూడియోలో..పెళ్లి సెట్టు వేసి మరీ.. తన నియర్ అండ్ డియర్స్ .. కో స్టార్ సమక్షంలో పెళ్లిచేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.