TOP9 ET: అంబానీల పెళ్లిలో ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ ఎంట్రీ | పాపం శంకర్ కలెక్షన్స్ మరీ ఇంత తక్కువా..!
అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ పెళ్లి ముంబైలో అంగరంగ వైభంగా జరిగింది. ఇక పెళ్లికి మించి కొత్త జంట 'శుభ ఆశీర్వాద్' కార్యక్రమం మరింత గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ వేడుకలో.. చంద్రబాబుతో పాటే.. జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడం అందర్నీ ఆకట్టుకుంటోంది. వారాహి మాలలోనే వెళ్లిన పవన్ శుభ ఆశీర్వాద కార్యక్రమంలో సెంట్రాఫ్ అట్రాక్షన్ అవ్వడం.. తెలుగు ప్రేక్షకులను.. పవన్ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.
01.ambani: అంబానీల పెళ్లిలో.. ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ ఎంట్రీ.
అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ పెళ్లి ముంబైలో అంగరంగ వైభంగా జరిగింది. ఇక పెళ్లికి మించి కొత్త జంట ‘శుభ ఆశీర్వాద్’ కార్యక్రమం మరింత గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ వేడుకలో.. చంద్రబాబుతో పాటే.. జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడం అందర్నీ ఆకట్టుకుంటోంది. వారాహి మాలలోనే వెళ్లిన పవన్ శుభ ఆశీర్వాద కార్యక్రమంలో సెంట్రాఫ్ అట్రాక్షన్ అవ్వడం.. తెలుగు ప్రేక్షకులను.. పవన్ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.
02.Pushpa 2: రిలీజ్‌కు ముందే పుష్ప2కు బాలీవుడ్‌లో 250 కోట్ల బిజినెస్.
పుష్ప 2 బిజినెస్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా. ఈ సినిమా హిందీ నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిందన్నారు. హిందీలో ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ కలుపుకొని 250 కోట్ల వరకు బిజినెస్ చేసిందన్నారు జ్ఞానవేల్‌రాజా.
03.Indian 2: పాపం శంకర్.. కలెక్షన్స్ మరీ ఇంత తక్కువా..!
భారతీయుడు 2 తొలి రోజు కలెక్షన్ లెక్కలు అభిమానులకు షాక్ ఇస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా… తొలి రోజు ఈ సినిమా కేవలం 26 కోట్లు మాత్రమే సాధించిందన్న టాక్ వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరోసారి సేనాపతి పాత్రలో కనిపించారు కమల్ హాసన్.
04.bollywood: భారతీయుడికి షాకిచ్చిన బాలీవుడ్ పరిస్థితి దారుణం.
ఇక ఇండియన్ 2 పరిస్థితి బాలీవుడ్ లో అయితే మరీ దారుణంగా తయారైంది. ఇండియన్ 2కు నార్త్ లో జోరుగానే ప్రచారం చేసినప్పటికీ.. భారీగా ఓపెనింగ్స్ రాబట్టడంలో విఫలమైంది. ఇక ట్రేడ్ వర్గాల అంచనా ప్రచారం.. నార్త్ లో భారతీయుడు మరీ ఒక కోటి కలెక్షన్స్ మాత్రమే తెచ్చుకోవడం.. ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది. అందులోనూ.. ఇక కలెక్షన్స్ పెరగవనే టాక్ నెట్టింట వస్తోంది. దీంతో ఈ సినిమా పరిస్థితి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరీ దారుణంగా ఉందంటూ.. ఫిల్మ్ క్రిటిక్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్న పరిస్థితి.
05.raj tharun: లావణ్యకు 5 కోట్ల ఆఫర్.?
రాజ్‌తరుణ్, మాల్విపై ఫిర్యాదు చేసినా ఇంత వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు లావణ్య. కేసు వెనక్కి తీసుకోవాలని 5 కోట్లు ఆఫర్ చేశారని.. బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు లావణ్య. అంతేకాదు రాజ్ తరుణ్ తాను కోసం ఎంతవరకైనా వెళ్తానంటూ.. చాలా బలంగా చెబుతున్నారు ఈమె.
06.vishnu: యూట్యూబ్ ట్రోలర్స్‌పై విష్ణు పంచ్ యాక్షన్ షురూ..
యూట్యూబ్ ట్రోలర్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు. సోషల్ మీడియాలో డార్క్ కామెడీ పేరుతో సినిమా వాళ్లపై ట్రోలింగ్, అసభ్యకర వీడియోలు చేస్తున్న 5 యూట్యూబ్ అకౌంట్లను డిలీట్ చేయించారు. రెండ్రోజుల క్రితం సినిమా వాళ్లపై అసభ్యంగా ట్రోలింగ్ వీడియోలు చేస్తున్న ట్రోలర్లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంచు విష్ణు. మహిళలను అత్యంత జుగుప్సాకరంగా వర్ణించడం ఏ మాత్రం సమర్థనీయం కాదని మంచు విష్ణు తేల్చి చెప్పారు. నటీనటులపై అసభ్యకర వీడియోలు, మీమ్స్ చేస్తున్న వారి అకౌంట్లను 48 గంటల్లో డిలీట్ చేయాలంటూ వార్నింగ్ ఇచ్చిన విష్ణు… ఇప్పుడు ఆయనే స్వయంగా యాక్షన్‌లోకి దిగారు.
07.Mirzapur 3: OTTలో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతున్న మిర్జాపూర్ 3.
మిర్జాపూర్ సీజన్ 3 డిజిటల్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ సెట్ చేసింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన షో తొలి వారంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన షోగా నిలిచింది. అదే సమయంలో 75 దేశాల్లో టాప్ 10లో ట్రెండ్ అవుతూ మరో రికార్డ్ సొంతం చేసుకుంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ షో ఇప్పటికీ భారీ వ్యూస్ సాధిస్తోంది.
08.ambani: ఇది కదా పెళ్లంటే దిగివచ్చిన తారాలోకం.!
అనంత్ అంబానీ- రాధిక వివాహానికి తారాలోకం దిగి వచ్చింది. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని రంగాల సినీ ఇండస్ట్రీల ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.. ఆనందోత్సవాలతో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేశారు. షారుక్, రణ్‌వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ కాలు కదిపారు. వారికి రజనీకాంత్ జత కలిశారు. ముకేశ్ అంబానీ తన మనవళ్లతో చిందులేశారు. నీతా అంబానీతోపాటు కుటుంబసభ్యులంతా డ్యాన్స్ వేశారు. సెలబ్రిటీల సందడితో ముంబై మిరుమిట్లు గొలిపింది. ఇక టాలీవుడ్ నుంచి చరణ్ – ఉపాసన, మహేష్-నమ్రత ఆయన కూతురు సితారా, రానా- ఆయన భార్య మిహికా బజాజ్, వెంకీ, అఖిల్ అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేశారు .
09.ambani: వామ్మో.. పెళ్లి ఖర్చు 5 వేల కోట్లా..?
ఇక ఇప్పటివరకు అనంత్-రాధిక వివాహానికి సంబంధించిన ప్రతి వేడుకలోనూ దేశ సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఏమాత్రం తగ్గకుండా ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. ఏడు నెలలక్రితం మొదలైన వేడుకలు ఈనెల 14 తేదీతో ముగియనున్నాయి. అయితే తన చిన్న కుమారుడు అనంత్ వివాహాన్ని నభూతో నభవిష్యతి అనే రీతిలో జరిపిస్తున్న ముకేశ్ అంబానీ, ఈ వేడుకకు ఎంత ఖర్చు చేశారనే విషయమై చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వివాహ వేడుక కోసం రూ.4,వేల కోట్ల నుంచి రూ. 5,వేల కోట్ల వరకు ఖర్చుచేసి ఉంటారని అంచనా.
10.ishwarya: ఐశ్వర్య విడాకులు నిజమేనా.? ఇదే ప్రూఫా.?
ఓ పక్క అంబానీ ఇంట పెళ్లి వేడుకలు నెట్టింట వైరల్ అవుతుండగా.. అందులోని ఓ వీడియో ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఐశ్యర్యా రాయ్.. తన బచ్చన్ ఫ్యామిలీతో కలిసి రాకుండా.. తన కూతురితో కలిసి ఈవెంట్‌కు సపరేట్గా రావడం.. ఎప్పటి నుంచో నెట్టింట వైరల్ అవతున్న అభిషేక్ – ఐశ్యర్య విడాకుల న్యూస్‌కు మరింత గా ఆజ్యం పోస్తోంది. మరో సారి వీరిద్దరూ విడిపోయారే న్యూస్ .. బీ టౌన్‌లో చక్కర్లు కొట్టేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.