TOP 9 ET: బంగ్లాదేశ్‌ లో తెలుగు ప్రజల రక్షకుడిగా NTR | అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ బిగ్ ప్లాన్.

Updated on: Oct 02, 2024 | 9:37 AM

ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల ముహూర్తం కూడా షూరు అయిన ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. బంగ్లాదేశ్‌ నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది. అక్కడున్న తెలుగువారికి అండగా నిలిచే వ్యక్తిగా తారక్‌ కనిపిస్తారని సమాచారం. వచ్చే ఏడాది నీల్‌ సెట్స్ లో జాయిన్‌ అవుతారు తారక్‌.

01.NTR: బంగ్లాదేశ్‌ లోతెలుగు ప్రజల రక్షకుడిగా NTR ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల ముహూర్తం కూడా షూరు అయిన ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. బంగ్లాదేశ్‌ నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది. అక్కడున్న తెలుగువారికి అండగా నిలిచే వ్యక్తిగా తారక్‌ కనిపిస్తారని సమాచారం. వచ్చే ఏడాది నీల్‌ సెట్స్ లో జాయిన్‌ అవుతారు తారక్‌. 02.POWERSTAR: డ్యూయట్‌ సాంగ్‌ చేస్తున్న డిప్యూటీ సీఎం సాబ్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం విజయవాడలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో పవన్‌, నిధి మీద కీలక సన్నివేశాలతోపాటు ఓ పాటను కూడా చిత్రీకరించడానికి ప్లాన్‌ చేస్తున్నారు డైరక్టర్‌ జ్యోతికృష్ణ. వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కానుంది హరిహరవీరమల్లు. 03.Goat: OTTలోకి గోట్ వచ్చేస్తుందోచ్.. దళపతి విజయ్‌ నటించిన సినిమా ది గోట్‌. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. సింహం గోట్‌గా మారడాన్ని ఎప్పుడైనా చూశారా అంటూ గోట్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. అక్టోబర్‌ 3న దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ గోట్‌ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్. 04.Karthi : మహేష్ , నేను స్కూల్లో క్లాస్‌మేట్స్ సరైన కథ కుదిరితే సూపర్‌స్టార్‌ మహేష్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు హీరో కార్తి. చెన్నైలో మహేష్‌, తాను కలిసి చదువుకున్నామని, క్లాస్‌మేట్స్...