Jani Master: జానీ మాస్టర్ లైఫ్ లో వంకర టింకర స్టెప్పులు.. ఇంతకీ ఏమిటి అసలు కహానీ

Edited By: TV9 Telugu

Updated on: Sep 19, 2024 | 3:41 PM

మళయాళ చిత్రపరిశ్రమలో ఏం జరిగిందో చూశాం. ఆ దెబ్బకు తమిళ చిత్రపరిశ్రమ ఏం చేసిందో కూడా చూశాం. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి అలెర్ట్ బెల్స్ మోగుతున్నాయి. ఓ మహిళా కొరియోగ్రాఫర్ తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు అని పోలీస్ కేసు పెట్టింది. దీంతో జానీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంపై టాలీవుడ్ కూడా ఫోకస్ పెట్టింది.

మళయాళ చిత్రపరిశ్రమలో ఏం జరిగిందో చూశాం. ఆ దెబ్బకు తమిళ చిత్రపరిశ్రమ ఏం చేసిందో కూడా చూశాం. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి అలెర్ట్ బెల్స్ మోగుతున్నాయి. ఓ మహిళా కొరియోగ్రాఫర్ తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు అని పోలీస్ కేసు పెట్టింది. దీంతో జానీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంపై టాలీవుడ్ కూడా ఫోకస్ పెట్టింది. తెలుగు చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపులపై విచారణకు సంబంధించి ఏర్పాటుచేసిన.. పరిష్కార ప్యానెల్‌ ముందుకు ఈ అంశం వెళ్లింది. మరిప్పుడు ఈ కేసులో ఏం తేలనుంది? చిత్రపరిశ్రమ పరంగా టాలీవుడ్ దీనికి ఎలాంటి పరిష్కారం చూపనుంది? బాధితురాలి విషయంలో జానీ ఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడు? ఆ లేడీ కొరియాగ్రాఫర్ ఎదుర్కొన్న కష్టాలేంటి? ఇబ్బందులేంటి? తెలుగు చిత్రపరిశ్రమ.. బాధితురాలికి ఎలాంటి భరోసా ఇచ్చింది? జానీ మాస్టర్ కేసులో బాధితురాలిది మధ్యప్రదేశ్. ఆమె 2017లో ఓ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఆ షో కు జడ్జ్ గా జానీ మాస్టర్ ఉన్నాడు. ఆ కార్యక్రమంలో బాధితురాలి పెర్ ఫార్మెన్స్ ఆయనకు నచ్చింది. తన దగ్గర డ్యాన్స్ అసిస్టెంట్ గా ఛాన్స్ ఇస్తానన్నాడు. చెప్పినట్టుగానే ఆయన ఛాన్స్ ఇచ్చాడు. 2019లో జానీ తనకు కాల్ చేశాడని.. తన టీమ్ లోకి ఆహ్వానించాడని చెప్పింది. మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఎన్టీఆర్ మెచ్చిన తలప్పకట్టి బిర్యానీ ఎందుకంత ఫేమస్...

Published on: Sep 19, 2024 11:58 AM