Thalapathy Vijay: బాలయ్య దెబ్బకు.. షాక్‌లోకి విజయ్‌ !! ట్రెండింగ్‌లో నటసింహం

Updated on: Jan 07, 2026 | 5:13 PM

తలపతి విజయ్ 'జన నాయగన్' చిత్రం 'భగవంత్ కేసరి' రీమేక్ అని ట్రైలర్ విడుదల తర్వాత స్పష్టమైంది. విజయ్ రాజకీయ కెరీర్‌కు తగ్గట్టు కథలో మార్పులు చేశారు. దీంతో, 'జన నాయగన్' కథ తెలుసుకోవడానికి ప్రేక్షకులు 'భగవంత్ కేసరి'ని OTTలో చూస్తున్నారు. ఫలితంగా, అమెజాన్ ప్రైమ్‌లో 'భగవంత్ కేసరి' భారీ డిమాండ్‌తో టాప్‌లో నిలిచింది, అమెజాన్ కూడా ఈ విషయాన్ని ప్రకటించింది.

తమిళ హీరో విజయ్ తలపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్. ఇదే సినిమాను తెలుగులో జన నాయకుడు పేరుతో విడుదల చేస్తున్నారు. అయితే, జన నాయగన్ సినిమా విషయంలో ముందు నుంచి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అదేంటంటే, ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని. కానీ, మేకర్స్ మాత్రం జన నాయగన్ అనేది రీమేక్ కాదని చెప్పుకుంటూ వచ్చారు. కానీ, ఇటీవల జన నాయగన్ ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత తెలిసిందే ఇది పక్కా భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని. కాకపోతే, విజయ్ ప్రస్తుత పొలిటికల్ కెరీర్ కి సెట్ అయ్యేలా కథను కాస్త చేంజ్ చేశారు. దీంతో, జన నాయగన్ సినిమా కథ ఏంటో తెలుకోవడానికి ఓటీటీలో భగవంత్ కేసరి సినిమా చూస్తున్నారు ఆడియన్స్. దీంతో, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో భగవంత్ కేసరి సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. దెబ్బకు టాప్ లోకి వెళ్ళింది ఈ మూవీ. ఇదే విషయాన్ని అమెజాన్ అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jabardasth Naresh: జబర్దస్త్ నరేష్ పెళ్లి పేరుతో ప్రచారం.. మళ్ళీ మొదటికొచ్చిన ప్రయత్నాలు

ఈవెంట్‌లో సీనియర్ నటికి పూనకం.. వైరల్ వీడియో

మెస్సీ Vs రొనాల్డో ‘వెయ్యి గోల్స్’ మొనగాడు ఎవరు ??

గోదావరిలో పడవలతో చిరంజీవి పేరు.. ఆకట్టుకున్న దృశ్యం

Sravana Bhargavi: భాగస్వామి సపోర్ట్‌ లేనప్పుడు.. ఇలాగే జరుగుతుంది !!