Thalapathy Vijay: దళపతి కోటి రూపాయల విరాళం.. విశాల్ ఎమోషనల్
విజయ్ సేవా గుణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే తన సొంత డబ్బుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. కొన్ని నెలల క్రితం మిచాంగ్ తుపాన్ బాధితులకు కూడా వరద సహాయం అందించి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకున్నాడీ కోలీవుడ్ స్టార్ హీరో. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘమైన నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం కోసం ఏకంగా కోటి రూపాయాల విరాళం అందించారు విజయ్.
విజయ్ సేవా గుణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే తన సొంత డబ్బుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. కొన్ని నెలల క్రితం మిచాంగ్ తుపాన్ బాధితులకు కూడా వరద సహాయం అందించి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకున్నాడీ కోలీవుడ్ స్టార్ హీరో. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘమైన నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం కోసం ఏకంగా కోటి రూపాయాల విరాళం అందించారు విజయ్. ఈ విషయాన్ని మరో స్టార్ హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా విజయ్ తో కలిసున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన విశాల్. ఇంతకీ విశాల్ ఏం ట్వీట్ చేశారంటే.. “థ్యాంక్యూ అన్నది కేవలం రెండు పదాలే కావొచ్చు. కానీ నా మనసు లోపలి నుంచి వచ్చే ఆ మాటకు ఎంతో విశాలమైన భావన ఉంది. నా అభిమాన నటుడు, నాకు అత్యంత ఆప్తుడైన దళపతి విజయ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. నడిగర్ సంఘం భవవ నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు చెప్పారు. ఆయనకు ఆ భగవంతుడి దీవెనలు, ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. మీ సహకారం, ప్రమేయం లేకుండా నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తి కాదు. అందరి మద్దతుతో త్వరలోనే మన కల సాకారం కానుంది. దళపతి విజయ్ నిర్ణయం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది” అని దళపతి విరాళంపై ఎమోషనల్‌గా రాసుకొచ్చారు విజయ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Premalu: ‘ప్రేమలు’ చూసి మహేష్ ఫిదా.. నవ్వలేక చచ్చాడట!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

