షురూ అయిన సంక్రాంతి సందడి… వరుస కట్టిన సినిమాలు!
సిల్వర్ స్క్రీన్ సంక్రాంతి సందడి మొదలైంది. రాజాసాబ్ ఇప్పటికే దూసుకొచ్చాడు, అదనపు సన్నివేశాలతో అలరిస్తున్నాడు. ఇప్పుడు శంకరవరప్రసాద్ సినిమా థియేటర్లలోకి ప్రవేశించింది. చిరంజీవి, వెంకటేష్, నయనతార, క్యాథరిన్, రవితేజ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి వంటి తారల చిత్రాలు ఈ సంక్రాంతికి క్యూ కట్టాయి.
సిల్వర్ స్క్రీన్ సంక్రాంతి పండుగ మొదలైంది. ఇప్పటికే రాజాసాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి, అదనపు సన్నివేశాలతో సందడి చేస్తోంది. ఇప్పుడు శంకరవరప్రసాద్ చిత్రం కూడా థియేటర్లలోకి గ్రాండ్ ప్రీమియర్ షోలతో ప్రవేశించింది. మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేష్, నయనతార, క్యాథరిన్ ట్రేసా వంటి తారలు స్క్రీన్లపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శంకరవరప్రసాద్ విడుదలైన మరుసటి రోజే “భర్త మహాశయులకు విజ్ఞప్తి” టీం కూడా వస్తున్నట్లు ప్రకటించింది. రవితేజ సినిమా కూడా విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి గతంలో చెప్పినట్లుగా, శర్వానంద్ “నారీ నారీ నడుమ మురారి” చిత్రంతో సంక్రాంతికి వస్తున్నారు. సంక్రాంతికి వచ్చి విజయం సాధించడం తనకు కొత్త కాదని, ఈ ఏడాది కూడా కలిసి వస్తుందని శర్వానంద్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :