ఏ హీరో ఎక్కడున్నారు..? ఎవరి సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది

Edited By:

Updated on: Dec 24, 2025 | 12:25 PM

టాలీవుడ్‌లో షూటింగ్‌ల సందడి మామూలుగా లేదు. వణికించే చలిలోనూ మన హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాని, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ తమ సినిమాలను వివిధ స్టూడియోలలో, లొకేషన్లలో పూర్తి చేస్తున్నారు. ఏ హీరో ఎక్కడ చిత్రీకరణలో ఉన్నారో ఈ కథనంలో తెలుసుకోండి.

టాలీవుడ్‌లో షూటింగ్స్ సందడి మామూలుగా లేదు.. ఎప్పట్లాగే వణికించే చలిలోనూ వరస షూటింగ్స్ చేస్తూ అస్సలు తగ్గేదేలే అంటున్నారు మన హీరోలు. ఒకరిద్దరు మినహాయిస్తే.. మిగిలిన హీరోలంతా కెమెరా ముందే బిజీ అయ్యారు. మరి ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతుంది.. ఏ హీరో ఎక్కడున్నాడో ఈ రోజు షూటింగ్స్ స్పెషల్ ప్యాక్‌లో చూద్దామా..? షూటింగ్ స్టోరీలో ముందుగా హెలో నేటివ్ స్టూడియోలో ఏం జరుగుతున్నాయో చూద్దాం..! నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ప్యారడైజ్‌తో పాటు.. శ్రవణ్ హీరోగా ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తున్న సినిమా, సుడిగాలి సుధీర్ కథాకళి, శర్వానంద్ భోగి, ప్రశాంత్ వర్మ అధీరా షూటింగ్స్ హెలో నేటివ్‌లో జరుగుతున్నాయి. ఇక మహేష్ వారణాసి, ప్రభాస్ ఫౌజీ, ఎన్టీఆర్ నీల్ సినిమాల షూటింగ్స్ RFCలో జరుగుతున్నాయి. చిరంజీవి, అనిల్ రావిపూడి మనశంకరప్రసాద్ గారు షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో జరుగుతుంది.. మరో 2 రోజుల్లో పూర్తి కానుంది. అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలో.. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి షూట్ జనవాడలో జరుగుతున్నాయి. రామ్ చరణ్ పెద్ది షూటింగ్ కొన్ని రోజులుగా కోఠిలో జరుగుతుంది. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ 3 వారాలుగా అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే జరుగుతుంది. సూర్య, వెంకీ అట్లూరి సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. అఖిల్ అక్కినేని లెనిన్ షూట్ బూత్ బంగ్లాలో జరుగుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

రైలు ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఛార్జీలు

మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు

Egg Price: మండిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్ ఎంతంటే

ఊబకాయాన్ని తగ్గించే బ్యాక్టీరియా.. పరిశోధకుల కీలక ముందడుగు