బడ్జెట్‌లు బారెడు.. కలెక్షన్లు మూరెడు.. ఏంటిది..?

Edited By:

Updated on: Dec 24, 2025 | 1:08 PM

ప్యాన్ ఇండియా, 1000 కోట్ల కలలు కంటున్న టాలీవుడ్ ప్రస్తుత బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ తీవ్ర నిరాశ పరుస్తోంది. సింగిల్ లాంగ్వేజ్ సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతుంటే, భారీ బడ్జెట్లతో మన సినిమాలు 2025లో 500 కోట్లు కూడా దాటలేకపోయాయి. భారీ మాటలకు, చేతలకు మధ్య వ్యత్యాసం ఎందుకు? తెలుగు సినిమాకు ఏమైంది? దీనిపై ప్రత్యేక విశ్లేషణ.

మాట్లాడితే ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అంటూ జబ్బలు చరుచుకుంటాం.. 1000 కోట్లు పరిచయం చేసింది మేమేనంటాం.. కానీ పర్ఫార్మెన్స్ అలా లేదు. కాస్త కఠువుగానే ఉంటుంది మరి.. ఓ పక్క సింగిల్ లాంగ్వేజ్ సినిమా 1000 కోట్లు కొడుతుంటే.. 2025లో మనోళ్లు సాధించేందేంటి..? బడ్జెట్స్‌పై పెడుతున్న ఫోకస్.. ఔట్ పుట్‌లో కనబడట్లేదెందుకు..? మన సినిమాలకు ఏమైంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..! 2022లో RRR 1200 కోట్లు.. 2024లో పుష్ప 2 సినిమా 1800 కోట్లు, కల్కి 2కు 1200 కోట్లకు పైగా వచ్చాయి. 2023లో సలార్ 500 కోట్ల క్లబ్బులో చేరింది.. గతేడాది దేవర 500 కోట్ల వరకు వసూలు చేసింది. 2025లో మాత్రం కేవలం మాటలే కానీ చేతలేం లేవు. వచ్చిన స్టార్స్ తోక ముడిచారు. 1000 కోట్లు అని కలలు గన్న గేమ్ ఛేంజర్, వార్ 2 దారుణంగా నిరాశ పరిచాయి. మరో వారం రోజులైతే 2026 వచ్చేస్తుంది. కానీ ఈ ఏడాది ప్యాన్ ఇండియా సినిమాలకు కలిసొచ్చిందేం లేదు. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ లాంటి హీరోలు 2025లో అసలు కనబడనే లేదు. అది కూడా టాలీవుడ్‌కు మైనస్సే. దాంతో ఈ ఏడాది 500 కోట్లు కూడా రాబట్టలేకపోయింది టాలీవుడ్. సంక్రాంతికి వస్తున్నాం, ఓజి మాత్రమే 300 కోట్ల క్లబ్బులో చేరాయి. మిరాయ్, హిట్ 3, డాకూ మహారాజ్, కుబేరా.. తాజాగా అఖండ 2.. 100 కోట్ల క్లబ్బులో చేరాయి.. కనీసం 200 కోట్ల సినిమాలు కూడా ఏం లేవు. మాట్లాడితే ప్యాన్ ఇండియా, మాది వందల కోట్ల బడ్జెట్ అంటారు మన మేకర్స్. కానీ పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఓవైపు అక్కడ ధురంధర్ సింగిల్ లాంగ్వేజ్‌లోనే 15 రోజుల్లో 870 కోట్లు వసూలు చేసి.. 1000 కోట్ల వైపు అడుగులేస్తుంది. కన్నడలో కాంతార ఛాప్టర్ 1 ఏకంగా 853 కోట్లు వసూలు చేస్తే.. ఛావా 800 కోట్లు కొల్లగొట్టింది. సైయ్యారా 560 కోట్లు తెస్తే.. కూలీ యావరేజ్ టాక్‌తోనే 518 కోట్లు వసూలు చేసింది. ఈ లిస్టులో తెలుగు సినిమా ఒక్కటీ లేదు. మనమే తోపులం అని కొన్నేళ్లుగా జబ్బలు చరుచుకుంటున్న టాలీవుడ్ హీరోలకు ఇది పెద్ద షాకే. మరి కనీసం 2026లో అయినా మనోళ్లు కమ్ బ్యాక్ ఇస్తారా లేదా అనేది చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

రైలు ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఛార్జీలు

మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు

Egg Price: మండిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్ ఎంతంటే

ఊబకాయాన్ని తగ్గించే బ్యాక్టీరియా.. పరిశోధకుల కీలక ముందడుగు