బావ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. బాబాయ్‌ సర్‌ప్రైజ్‌.. అబ్బాయి లంకా పయనం!

Updated on: Jun 12, 2026 | 8:35 AM

తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా ఆసక్తికరమైన అప్‌డేట్స్ అలరిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ 66వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మేకర్స్ అదిరిపోయే శుభవార్తలు అందించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న NBK111 సినిమా నుంచి పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. దీంతోపాటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న NBK12 సినిమా ప్రకటన కూడా హాట్ టాపిక్‌గా మారింది. పలు రీ-రిలీజ్ చిత్రాల హడావిడి కూడా అభిమానుల్లో జోష్ నింపింది.

 

మరోవైపు, రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని సాధిస్తోంది. జూన్ 4న విడుదలైన ఈ సినిమా ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹332.1 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ₹350 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో కూడా పెద్దికి మంచి స్పందన లభిస్తోంది. అల్లు అర్జున్ పెద్ది టీమ్‌ను అభినందిస్తూ, రామ్ చరణ్ నటన, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. దర్శకుడు బుచ్చిబాబును సైతం అభినందించారు. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్ సినిమా తదుపరి షెడ్యూల్ శ్రీలంకలో జరగనుంది.

మరిన్ని వీడియోల కోసం :

బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్

ఐమ్యాక్స్ ఐమాక్స్ కోసం ఆ రేట్లు తప్పవా..?

మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు

మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!

Follow Us