Teja Sajja - Hanuman: OTTలో హనుమాన్.. ఆ పండగరోజే స్ట్రీమింగ్.! కలెక్షన్స్ తో రికార్డ్స్.

Teja Sajja – Hanuman: OTTలో హనుమాన్.. ఆ పండగరోజే స్ట్రీమింగ్.! కలెక్షన్స్ తో రికార్డ్స్.

Anil kumar poka

|

Updated on: Jan 31, 2024 | 9:28 AM

థియేటర్లలో హనుమాన్‌ ప్రభంజనం తగ్గడం లేదు. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా థియేటర్ల వద్ద ఇంకా హౌస్‌ ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ ఆడియెన్స్‌ కూడా... హనుమాన్‌ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే ఈ సినిమా 250 కోట్లను దాటేసి 300 కోట్ల వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించాడు. అమృతా అయ్యర్‌ కథానాయిక.

థియేటర్లలో హనుమాన్‌ ప్రభంజనం తగ్గడం లేదు. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా థియేటర్ల వద్ద ఇంకా హౌస్‌ ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ ఆడియెన్స్‌ కూడా… హనుమాన్‌ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే ఈ సినిమా 250 కోట్లను దాటేసి 300 కోట్ల వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించాడు. అమృతా అయ్యర్‌ కథానాయిక. మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్‌ కుమార్ నటించి మెప్పించింది. స్టార్‌ హీరోల సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ కాన్సెప్ట్‌ మీద నమ్మకంతో మరీ సంక్రాంతికి రిలీజ్ చేశారు మేకర్స్‌. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది హనుమాన్‌. అయితే థియేటర్లలో బ్లాక్ బస్టర్‌ టాక్‌ తో దూసుకెళుతోన్న హనుమాన్‌ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ వర్మ, తేజ సజ్జా సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త వైరల్‌గా మారింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 హనుమాన్‌ డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. ఎప్పటిలాగే థియేట్రికల్‌ రిలీజ్‌ నెల రోజుల తర్వాత సినిమాను ఓటీటీలోకి తీసుకొద్దామనుకుంది. అయితే ప్రస్తుతం థియేటర్ల వద్ద హనుమాన్‌ దూకుడు ఏ మాత్రం తగ్గకపోవడంతో… థియేట్రికల్‌ రిలీజ్ నుంచి 55 రోజుల తర్వాతే హనుమాన్‌ ను ఓటీటీలోకి తీసుకురావాలని భావిస్తున్నారట మేకర్స్‌. ఇందుకు జీ 5 ఓటీటీ సంస్థ కూడా ఒకే చెప్పినట్లు టాక్‌. అంటే మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో హనుమాన్ ఓటీటలోకి స్ట్రీమింగ్‌కు రావచ్చన్నమాట. అంటే సరిగ్గా శివరాత్ర పండగకు హనుమాన్ సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్‌ ఉందిని నెట్టింట ఇప్పటికే ఓ టాక్ కూడా ఉంది. సో లెట్స్‌ సీ.. మేకర్స్‌ ఏ డేట్ అనౌన్స్ చేస్తారో మరి!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Published on: Jan 31, 2024 09:25 AM