Rajeev Kanakala: అవకాశాలు రావడం లేదుకానీ.. వస్తే తరుణ్‌కు తిరుగే ఉండదు

Updated on: Jan 08, 2026 | 7:20 PM

నటుడు తరుణ్ సినిమాలకు దూరమవడంపై రాజీవ్ కనకాల షాకింగ్ కామెంట్స్ చేశారు. అవకాశాలు లేకనే తరుణ్ సినిమాలు మానేశాడని, ఓటీటీలో అద్భుతమైన కంబ్యాక్ ఇవ్వగలడని అన్నారు. తరుణ్ తల్లి రోజా రమణి కూడా మొదట కంబ్యాక్ గురించి చెప్పి, తర్వాత అతను వ్యాపారంపై దృష్టి పెట్టాడని పేర్కొన్నారు. తరుణ్ మళ్ళీ తెరపై ఎప్పుడు కనిపిస్తాడన్నది అభిమానుల ఎదురుచూపు.

ఇప్పుడంటే సిల్వర్‌ స్క్రీన్‌కు దూరంగా ఉంటున్నాడు కానీ.. అప్పట్లో తరుణ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేసేవి. యూత్‌ను థియేటర్ల వైపు నడిపించేవి. అలాంటి తరుణ్, సినిమాలకు దూరంగా.. ఇన్నాళ్లూ ఉండడం అనేది ఇప్పటికీ మనోడి ఫ్యాన్స్‌ను తికమక పెడుతూనే ఉంటుంది. తరుణ్ కంబ్యాక్ గురించి వారందర్నీ ఎదురు చూసేలా చేస్తూనే ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే రాజీవ్ కనకాల తరుణ్‌ ఫిల్మ్ కెరీర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తరుణ్‌కు అవకాశాలు రాకనే సినిమాలు మానేశాడంటూ చెప్పి ఆయన ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన రాజీవ్ కనకాల.. తారక్ తో పాటు సినిమా ఇండస్ట్రీలో తరుణ్, మనోజ్, శివ బాలాజీలు తనకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. అందులో తరుణ్‌ అద్భుతమైన నటుడని, సరైన అవకాశం వస్తే తిరిగి ఫామ్ లోకి వస్తాడంటూ కనకాల స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు ప్రత్యేకించి ఓటీటీ వేదికల ద్వారా.. తరుణ్‌ మళ్లీ తన ప్రతిభను చాటుకోగలడని రాజీవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రాజీవ్ కనకాల మాత్రమే కాదు రీసెంట్‌గా తరుణ్ అమ్మ రోజా రమణి కూడా.. తరుణ్ ఫిల్మ్ కెరీర్ గురించి మాట్లాడారు. తరుణ్‌ తొందర్లో కంబ్యాక్ ఇస్తున్నాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఈమె.. ఆ తర్వాత ఇంటర్వ్యూలో మాత్రం తరుణ్ పూర్తిగా బిజినెస్ మీద ఫోకస్ చేసినట్టు చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chandrabose: నలభై రూపాయల పుస్తకానికి.. 40 లక్షలు.. చంద్రబోస్ తుంటరి పనితో.. ఊరికి మేలు

RGV: ‘ఆర్జీవీని సైకో అన్నారు..అందుకే భయపడ్డా’ కానీ.. ఆ తర్వాత

Poonam Kaur: పెళ్లి.. అబార్షన్.. నా లైఫ్‌ గురించి సోషల్ మీడియాలో

శంకరవరప్రసాద్ సెన్సార్ రివ్యూ.. అంతా ఓకే గానీ..

Varanasi: జక్కన్న ఝలక్.. వారణాసి రిలీజ్ డేట్ లాక్