Sankranthi 2024 Movies: గుంటూరోడు Vs 5 బడా హీరోస్‌.. రంజుగా సంక్రాంతి పోరు.!

Sankranthi 2024 Movies: గుంటూరోడు Vs 5 బడా హీరోస్‌.. రంజుగా సంక్రాంతి పోరు.!

Anil kumar poka

|

Updated on: Dec 31, 2023 | 1:03 PM

పండగ రోజులు పక్కకు పెడితే.. సాధారణ రోజుల్లో మాత్రం.. సోలోగానే వచ్చేందుకు రెడీ అయిపోతారు స్టార్ హీరోలు. తమ ఓపెనింగ్స్‌కు.. రెవెన్యూకు.. రికార్డులకు ఎలాంటి నష్టం జరగకుండా.. హాలీడేస్‌ను చూసుకుని మరీ థియేటర్లో దూకేస్తారు. అదే పండగ రోజుల్లో.. అందులోనూ.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగలైన సంక్రాంతి, దసరా రోజుల్లో మాత్రం.. ఇలాంటివి పట్టించుకోకుండానే బరిలో దిగుతారు. వచ్చే సంక్రాంతి పండగరోజు కూడా.. అదే చేస్తున్నారు. మహేష్ గుంటూరోన్ని విస్మరించి మరీ...

పండగ రోజులు పక్కకు పెడితే.. సాధారణ రోజుల్లో మాత్రం.. సోలోగానే వచ్చేందుకు రెడీ అయిపోతారు స్టార్ హీరోలు. తమ ఓపెనింగ్స్‌కు.. రెవెన్యూకు.. రికార్డులకు ఎలాంటి నష్టం జరగకుండా.. హాలీడేస్‌ను చూసుకుని మరీ థియేటర్లో దూకేస్తారు. అదే పండగ రోజుల్లో.. అందులోనూ.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగలైన సంక్రాంతి, దసరా రోజుల్లో మాత్రం.. ఇలాంటివి పట్టించుకోకుండానే బరిలో దిగుతారు. వచ్చే సంక్రాంతి పండగరోజు కూడా.. అదే చేస్తున్నారు. మహేష్ గుంటూరోన్ని విస్మరించి మరీ… 5 బడా హీరోలు ..అదే రోజు జనవరి 12న తమ సినిమాలకు రిలీజ్ చేస్తున్నారు. ఆడియెన్స్‌కు మాంచి పోరును చూపించబోతున్నారు. త్రివిక్రమ్‌ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్.. గుంటూరు కారం సినిమాను తీరిగ్గానే ఫినిష్ చేస్తున్నప్పటికీ.. సినిమా రిలీజ్‌ డేట్‌ ను మాత్రం ముందుగానే, సంక్రాంతికి అంటూ చెప్పేశాడు. చెప్పినట్టే జనవరి 12న థియేటర్లోకి వస్తున్నాడు. అయితే మహేష్‌ లాంటి పెద్ద సినిమా ఫీల్డ్‌ లో ఉన్నా.. లెక్కచేయకుండా హనుమాన్ సినిమాతో తేజ సజ్జా వస్తున్నాడు.

ముందు కాస్త అటూ ఇటూ తడబడినప్పటికీ.. జనవరి 12నే అంటూ..కన్ఫర్మ్ చేసింది హనుమాన్ టీం. దానికి తగ్గట్టు గానే ప్రమోషన్స్ కూడా మొదలెట్టింది. ఇక హనుమాన్‌కు తోడు.. ధనుష్ కెప్టెన్‌ మిల్లర్, శివకార్తికేయన్ అయాలన్, విజయ్‌ సేతుపతి మేరీ క్రిస్మస్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇవి స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాకపోయినా.. ధనుష్, కార్తికేయన్, విజయ్‌ సేతుపతి.. ఇక్కడ కూడా ఫ్యాన్స్‌ బేస్ సంపాదించుకున్నారు. ఎంతలేదన్నా.. ఎన్నో కొన్ని థియేటర్లను, షోలను దక్కించుకుంటారు. దీంతో ఈ సినిమాలన్నీ.. మహేష్ గుంటూరోడికి పోటీ కానున్నాయనే టాక్ అయితే నెట్టింట వస్తోంది. కానీ ఈ సారి బాక్సాఫీస్‌ పోరు మాత్రం గట్టిగానే జరగనుందనే కామెంట్ కూడా… వస్తోంది. అసలు ఏమవుతుందో.. ముందు ముందు చూడాలి మరి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.