SS Rajamouli: ఇండియా నెం.1 డైరెక్టర్‌గా.. రాజమౌళికి మాత్రమే ఎలా సాధ్యం
ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే ఏ మాత్రం తడుముకోకుండా చెప్పే పేరు దర్శక ధీరుడు రాజమౌళి. రీజినల్ నుంచి నేషనల్, నేషనల్ నుంచి గ్లోబల్ రేంజ్‌కు ఎదుగుతున్న ఈ స్టార్ డైరెక్టర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన సాధించిన విజయాలు... ఆయన ముందున్న సవాళ్ల గురించి ఓ సారి మాట్లాడుకుందాం...? 24 ఏళ్ల క్రితం ఏ మాత్రం స్టార్ ఇమేజ్ లేని ఓ యంగ్ యాక్టర్‌తో స్టూడెంట్ నెంబర్ వన్ అనే చిన్న సినిమాతో పరిచయం అయిన రాజమౌళి, కెరీర్‌లో ఇన్ని సంచలనాలు సృష్టిస్తానని తాను కూడా ఊహించి ఉండరు.
కానీ తొలి సినిమాతోనే మాస్ ఆడియన్స్ పల్స్ ఏంటో పర్ఫెక్ట్‌గా అర్ధం చేసుకున్న ఈ సెల్యూలాయిడ్ సైంటిస్ట్, ప్రతీ సినిమాను కమర్షియల్ బ్లాక్ బస్టర్‌గా నిలబెడుతూ ఇండియాస్ నెంబర్ వన్ డైరెక్టర్‌గా ఎదిగారు. రీజినల్ రేంజ్‌లో కమర్షియల్ సినిమాకు కొత్త డెఫినియేషన్ ఇచ్చిన రాజమౌళి… ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి మాస్ స్టార్స్‌తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. బాహుబలితో ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీని తెర మీదకు తీసుకు వచ్చారు. రెండు భాగాలుగా రిలీజ్ అయిన బాహుబలి భారతీయ చలనచిత్ర ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఈ సినిమా తరువాత ప్రతీ దర్శకుడు పాన్ ఇండియా రేసులో పోటీ పడాలని కలలుగంటున్నారు. ట్రిపులార్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిన జక్కన్న, నెక్ట్స్ మహేష్ బాబుతో గ్లోబల్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ టాలెంట్ పవర్ ఏంటో చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో అపజయమే లేకుండా దూసుకుపోతున్న జక్కన్న.. మహేష్ మూవీతో మరో సంచలనం నమోదు చేయటం ఖాయం అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chandrababu Naidu: హైదరాబాద్ ను మించిన రాజధాని నిర్మించాలన్నదే లక్ష్యం
Tirupati: SV వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం
Pedda Amberpet: పెద్ద అంబర్‌పేట్ లో దొంగల బీభత్సం
Bihar Politics: బిహార్ ఎన్నికల ప్రచార రంగంలోకి ప్రధాని మోదీ
