Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శోభన్ బాబు పర్సనల్స్ షేర్ చేసిన మనవడు డాక్టర్ సురక్షిత్ వీడియో

శోభన్ బాబు పర్సనల్స్ షేర్ చేసిన మనవడు డాక్టర్ సురక్షిత్ వీడియో

Samatha J

|

Updated on: May 12, 2025 | 7:36 AM

నటభూషణ శోభన్‌బాబు వైవిధ్యమైన పాత్రలు, అనేక సూపర్ హిట్ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. తాజాగా శోభన్‌బాబు మానవుడు డాక్టర్ సురక్షిత్ బత్తిన వైద్యరంగంలో అరుదైన సర్జరీ చేసి గిన్నిస్ రికార్డులోకి ఎక్కారు. ఇటీవలే సురక్షిత్ బత్తిన ట్రూ 3డి లాపరోస్కోపీ ద్వారా భార్య సిస్ట్ ఉన్న 4.5 కిలోల గర్భాశయాన్ని తొలగించారు. 2019లో డాక్టర్ సింహా పేరిట ఈ రికార్డు ఉంది. అప్పట్లో ఆయన 4.1 కిలోల గర్భాశయాన్ని లాపరోస్కోపీ శస్త్రచికిత్స ద్వారా తొలగించి గిన్నిస్ రికార్డుల్లో స్థానం సాధించారు. ఇప్పుడు సురక్షిత్ ఆ రికార్డును బ్రేక్ చేశారు.

తనకు సురక్షిత్ అనే పేరు పెట్టింది శోభన్‌బాబే అని తాజాగా యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ సురక్షిత్ ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. శోభన్‌బాబు నటుడిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించేవారని ఆయన నుంచి తను అదే నేర్చుకున్నానని సురక్షిత్ అన్నారు. సినిమాల్లో నటించాలని దర్శకులు అడిగిన ఆ ఆఫర్‌ను శోభన్‌బాబు సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పుకొచ్చారు. తనను డాక్టర్‌గా రాణించాలన్నది శోభన్‌బాబు ఆశయమని ఆయన చనిపోయే సమయానికి తను ఎంబిబిఎస్ చదువుతున్నట్లు చెప్పారు. శోభన్‌బాబు సినిమాల్లో ఏమండీ ఆవిడ వచ్చింది థియేటర్లో చూసి ఎంజాయ్ చేసినట్లు సురక్షిత్ అన్నారు. డాక్టర్లకు సౌకర్యంగా ఉండే స్క్రబ్‌ను తనే సొంతంగా డిజైన్ చేసి తన బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నట్లు చెప్పారు. తనలోని డిజైనింగ్ టాలెంట్‌ను ఇలా ఆయన బయటపెట్టారు. భార్య డాక్టర్ శ్రీలతది విజయవాడ కాగా వారికి పదేళ్లు ఇంకా నాలుగేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం :

కొత్త చీపురు కొంటున్నారా జాగ్రత్త వీడియో

పైనాపిల్ జ్యూస్ తాగడం వలన బోలెడు లాభాలు వీడియో

ఆ రోజు హెయిర్ కట్ చేయించుకుంటే మీ పని అవుట్!వీడియో

మీలో లవ్ హార్మోన్ పెరగాలా.. ఇలా చేయండి వీడియో