తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెలా?

Updated on: Jan 17, 2026 | 1:54 PM

బాలీవుడ్ హిట్ చిత్రం తానాజీ విడుదలై ఆరేళ్లయింది. ఈ సందర్భంగా హీరో అజయ్ దేవగన్ ఆసక్తికరమైన హింట్ ఇచ్చారు, "కథ ఇంకా ముగిసిపోలేదు" అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందా లేదా ప్రీక్వెల్ ఉంటుందా అనే చర్చ మొదలైంది. తానాజీ గతానికి సంబంధించిన విశేషాలు లేదా శివాజీతో ఆయన అనుబంధం నేపథ్యంలో సినిమా ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ హిస్టారికల్ చిత్రం తానాజీ విడుదలై ఆరేళ్లు పూర్తయింది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2020లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా హీరో అజయ్ దేవగన్ ఒక ఆసక్తికరమైన హింట్ ఇచ్చారు. సినిమా స్టిల్స్ షేర్ చేస్తూ “కథ ఇంకా ముగిసిపోలేదు” అని వ్యాఖ్యానించారు. అజయ్ దేవగన్ చేసిన ఈ ప్రకటనతో తానాజీ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోందా అనే చర్చ మొదలైంది. మొదటి భాగంలో సైఫ్ అలీ ఖాన్ పోషించిన విలన్ ఉదయ్‌భాన్ సింగ్ రాథోడ్ క్లైమాక్స్‌లో మరణించినట్లు చూపించారు. అలాగే, తానాజీ ఒక చేయిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో సీక్వెల్‌లో అజయ్ దేవగన్ పాత్ర ఎలా ఉంటుందనే సందేహాలు తలెత్తుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ మళ్లీ కనిపిస్తారా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో

ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?

యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్‌!

సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్