Sunitha: ‘నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా’.. సునీత ఎమోషనల్..

|

Jun 05, 2023 | 9:45 AM

తెలుగు సినీ పరిశ్రమలో ఆయన గాత్రం ఓ మధురం. సంగీత ప్రపంచంలో ఆయన ఓ గాన గంధర్వుడు. ఎన్నో మధురమైన పాటలు ఆలపించి తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. దాదాపు పదమూడు భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడి స్వరరాగ రంగా ప్రవాహంలో మునిగి తేలిన లెజెండరీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం.

తెలుగు సినీ పరిశ్రమలో ఆయన గాత్రం ఓ మధురం. సంగీత ప్రపంచంలో ఆయన ఓ గాన గంధర్వుడు. ఎన్నో మధురమైన పాటలు ఆలపించి తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. దాదాపు పదమూడు భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడి స్వరరాగ రంగా ప్రవాహంలో మునిగి తేలిన లెజెండరీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా సినీ ప్రముఖులు, గాయనీ గాయకులు బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సింగర్ సునీత సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. “నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా.. పుట్టినరోజు శుభాకాంక్షలు నేరుగా చెప్పుకునే అదృష్టం లేకుండా చేసిన ఆ భగవంతుడిని ఈరోజు మాత్రం ఎప్పటికీ నిందిస్తూనే ఉంటాను” అంటూ బాలుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు సునీత.. ఇండస్ట్రీలో తన మధర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేసిన గాయనీ సునీత. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. కేవలం గాయనీగానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా.. తన మధరమైన గాత్రంతో సంగీత ప్రియులను మైమరపించారు. తన జీవితంలో కష్టం వచ్చిన ప్రతిసారీ తనకు అండగా ఉండి ఎస్పీ బాలు ధైర్యం చెప్పేవారని గతంలో అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు సునీత.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫుల్‌టైమ్‌ కూతురిగా జాబ్‌ ఆఫర్.. నెలకు జీతం ఎంతంటే ??

శుభమా అని పెళ్లి చేసుకుంటే.. ఇదేంట్రా బాబూ

3నెలల శిశువును ముద్దాడేందుకు యత్నించిన ఒరంగుటాన్.. హృదయాలను కట్టిపడేస్తున్న వీడియో

శవంపై కూర్చొని అఘోరా పూజలు.. తమిళనాడులో కలకలం సృష్టించిన ఘటన

Chiranjeevi: నాకు క్యాన్సర్ రాలేదు.. తప్పుగా అర్థం చేసుకున్నారు..

Follow us on